Homeఎంటర్టైన్మెంట్Nani The Paradise: నాని ప్యారడైజ్ కు మహేష్ కొడుకు షాక్..సింగిల్ స్టార్ తో పరువు...

Nani The Paradise: నాని ప్యారడైజ్ కు మహేష్ కొడుకు షాక్..సింగిల్ స్టార్ తో పరువు తీసేశాడు..

Nani The Paradise: సినిమా నచ్చితే ఐదు స్టార్లు.. నచ్చకపోతే సింగల్ స్టార్.. సినిమా రివ్యూల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు మహేష్ కుమారుడు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్ చర్చకు దారితీస్తోంది. ఒకే ఒక స్టార్ రేటింగ్ రివ్యూ ప్లాట్ ఫామ్ letter boxd లో గౌతమ్ కేవలం ఒకే ఒక స్టార్ రేటింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుందని.. […]

Nani The Paradise: సినిమా నచ్చితే ఐదు స్టార్లు.. నచ్చకపోతే సింగల్ స్టార్.. సినిమా రివ్యూల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు మహేష్ కుమారుడు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన సినిమాకు ఆయన ఇచ్చిన రేటింగ్ చర్చకు దారితీస్తోంది.

ఒకే ఒక స్టార్ రేటింగ్

రివ్యూ ప్లాట్ ఫామ్ letter boxd లో గౌతమ్ కేవలం ఒకే ఒక స్టార్ రేటింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుందని.. ఎమోషనల్ సీన్స్ లో నటీనటుల అభినయం ఆకట్టుకుందని గౌతమ్ పేర్కొన్నారు. మిగతా అంశాలు తనను తీవ్రంగా నిరాశపరిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సినిమా కూర్పు పై సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది అత్యంత భయానకంగా ఉందని వివరించాడు.

గౌతమ్ గతంలో పలు సినిమాలకు ఇచ్చిన రేటింగ్స్ ను ఒకసారి పరిశీలిస్తే.. ఆయన అభిరుచి తెలుస్తోంది. రన్వీర్ నటించిన దురంధర్ సినిమాకు నాలుగు స్టార్లు ఇచ్చాడు. టాక్సిక్ కు 0.5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కు 5 స్టార్లు, రాజమౌళి రూపొందించిన RRR కు నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చాడు. ఇక నాని నటించిన జెర్సీ విషయంలో మాత్రం గౌతం పూర్తి మార్కులు ఇచ్చాడు. ఆ సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్ కేటాయించాడు. అలాగే ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమాకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చారు.

తండ్రి సినిమాలకు ఫుల్ మార్కులు

గౌతమ్ రేటింగ్స్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మహేష్ బాబు సినిమాలకు ఫుల్ మార్కులు ఇచ్చాడు. తన తండ్రి నటించిన పోకిరి, 1 నేనొక్కడినే సినిమాలకు ఆయన ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఏ సినిమాను ఎలా అంచనా వేస్తారు.. ఆయనకు నచ్చే అంశాలు ఏంటి.. అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఒక సినిమాకు తక్కువ రేటింగ్ ఇవ్వడం అనేది పూర్తిగా వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన విషయం. ఒకరికి నచ్చిన సినిమా మరొకరికి నచ్చకపోవచ్చు. అదేవిధంగా గౌతం ది ప్యారడైజ్ కు సింగిల్ స్టార్ ఇవ్వడం పర్సనల్ ఒపినియన్ గా చూడాలి. మొత్తానికి నాని సినిమాకు గౌతం ఇచ్చిన రేటింగ్ తో పాటు ఎడిటింగ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానులు చర్చకు దారితీస్తున్నాయి. తెరపై సినిమా ఎలా ఉందన్న దానిపై ప్రేక్షకుల అభిప్రాయాలు భిన్నంగా ఉండడం సహజం. మరి ది ప్యారడైజ్ విషయంలో గౌతమ్ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper