Homeఎంటర్టైన్మెంట్The Paradise Movie: 8 ఏళ్ళ తర్వాత నాని కి ఘోర అవమానం.. ఇది మామూలు...

The Paradise Movie: 8 ఏళ్ళ తర్వాత నాని కి ఘోర అవమానం.. ఇది మామూలు దెబ్బ కాదు!

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు భారీ హైప్ ఉండడం వల్ల కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాల్లో ఊహించని రేంజ్ షేర్స్ వచ్చాయి. 103 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ […]

The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు భారీ హైప్ ఉండడం వల్ల కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ప్రాంతాల్లో ఊహించని రేంజ్ షేర్స్ వచ్చాయి. 103 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే , మొదటి వారం కూడా పూర్తి అవ్వకముందే 89 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే దాదాపుగా 90 శాతం రీకవరీ అయ్యింది అన్నమాట. ఫ్లాప్ టాక్ తో ఈమధ్య కాలం లో స్టార్ హీరోలు కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం లేదు , అలాంటిది నాని లాంటి మీడియం రేంజ్ హీరో ఫ్లాప్ టాక్ తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు.

తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే , ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మాత్రం నిరాశే ఎదురైంది. గడిచిన 8 ఏళ్ళల్లో నాని నుండి విడుదలైన చిత్రాల్లో , ఓవర్సీస్ మార్కెట్ లో పెద్ద ఫెయిల్యూర్ గా నిల్చింది ఈ సినిమానే అట. దేవదాసు , కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ లో ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత నాని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆడినా , ఆడకపోయినా , ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం దుమ్ము లేపేవి. కానీ ‘ది ప్యారడైజ్’ మాత్రం నిరాశపరిచింది. దాదాపుగా 5 మిలియన్ డాలర్లకు ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం 3 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

దీంతో 8 ఏళ్ళ తర్వాత నాని ఓవర్సీస్ లో ఫ్లాప్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ఓజీ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ‘బ్లడీ రోమియో’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన భారీ కం బ్యాక్ ఇస్తాడని, ఓవర్సీస్ లో మరోసారి తన సత్తా చూపిస్తాడని అంటున్నారు విశ్లేషకులు. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ముందుగా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేస్తారట. ఆ తర్వాత సినిమా షూటింగ్ మొత్తం లండన్ పరిసరాల్లోనే జరుగుతుందట. జనవరి లోపు షూటింగ్ ని పూర్తి చేసి , వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper