The Paradise Movie: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ డిజాస్టర్ టాక్ తో కూడా భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలకు కూడా టాక్ సరిగా రాకపోతే వసూళ్లు వచ్చే పరిస్థితులు లేనటువంటి రోజులివి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఈ ఏడాదిలోనే చూశాము. అలాంటిది ఒక నాని లాంటి మీడియం రేంజ్ హీరో సినిమా డిజాస్టర్ టాక్ మీద కూడా 95 శాతానికి పైకా రీకవరీ ని సొంతం చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. నైజాం ప్రాంతం లో భారీ లాభాలను కూడా రాబట్టింది ఈ సినిమా. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం భారీ నష్టాలే మిగిలాయి. ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 95 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 170 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ విడుదలకు ముందే మంచి ఫ్యాన్సీ రేటు కి కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యాలి. అంటే ఈ నెల 23 న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు , అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది అన్నమాట. కనీసం ఓటీటీ ఆడియన్స్ ని అయినా ఈ చిత్రం అలరిస్తుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ప్రతీ నాని సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.
పైగా ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య కూడా ఎక్కువే. అసలు ఈ సినిమాకు అంత పెద్ద డిజాస్టర్ టాక్ ఎలా వచ్చింది అని అనుకునేవాళ్లు సోషల్ మీడియా లో చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా నాని కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకు భారీ వ్యూస్ వస్తాయని అంటున్నారు. అయితే ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్ లో డీసెంట్ స్థాయిలోనే రన్ అవుతోంది. ఇలాంటి సమయం లో అప్పుడే ఎందుకు ఓటీటీ లో విడుదల చేయడం అని అంటున్నారు నెటిజెన్స్. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది అనేది.