Homeఎంటర్టైన్మెంట్Barabar Premistha Closing Collections: యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్ 'బరాబర్ ప్రేమిస్తా' క్లోజింగ్ కలెక్షన్స్...

Barabar Premistha Closing Collections: యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..పాపం దూలతీరింది!

Barabar Premistha Closing Collections: ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు బాగా వినిపిస్తున్న పేరు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Attitude Star Chandra Hass). ప్రముఖ టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఇతను, మొదటి సినిమాతోనే తన పొగరు యాటిట్యూడ్ తో తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గానే ఈయన […]

Barabar Premistha Closing Collections: ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు బాగా వినిపిస్తున్న పేరు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Attitude Star Chandra Hass). ప్రముఖ టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఇతను, మొదటి సినిమాతోనే తన పొగరు యాటిట్యూడ్ తో తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక రీసెంట్ గానే ఈయన ‘బారాబర్ ప్రేమిస్తా’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ లో ఇతగాడు పాడిన ఒక బూతు పాట సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెటిజెన్స్ ఒక రేంజ్ లో ఏకిపారేశారు, అనేక ప్రాంతాల నుండి చంద్రహాస్ పై పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేడీ చక్రవర్తి మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.

అంత పెద్ద వివాదం జరిగింది, ఇది నా సినిమా మీద ఎఫక్ట్ చూపిస్తుందేమో అని ‘బారాబర్ ప్రేమిస్తా’ విడుదల రోజున బోరుమని ఏడ్చాడు చంద్రహాస్. మరి ఈ వివాదం చంద్రహాస్ బయపడినట్టే, సినిమాకు నష్టం చేసిందా, లేదా లాభం చేసిందా ?, థియేటర్స్ వద్ద రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లోజింగ్ లో ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజున 31 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా రెండవ రోజున 22 లక్షలు, మూడవ రోజున 14 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి వీకెండ్ లో 67 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం దారుణంగా పడిపోయింది. సోమవారం రోజున కేవలం పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, మంగళవారం రోజున 7 లక్షలు, బుధవారం రోజున 4 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 93 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 79 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టగా, షేర్ వసూళ్లు దాదాపుగా 53 లక్షల రూపాయిల వరకు ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఒకవేళ చంద్ర హాస్ నోటి దూలతో అలా బూతు పాట పాడి ఉండకపోయుంటే, ఈ చిత్రం కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వీల్లేదని, మనోడు నోటి దూలతో మొత్తం నాశనం చేసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా నేర్పిన పాఠం నుండి పలు విషయాలు నేర్చుకొని, చంద్ర హాస్ తన చిత్రం విడుదల సమయానికి మార్చుకుంటాడని ఆశిద్దాం.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper