Sudigali Sudheer: ప్రస్తుతం ‘జీ తెలుగు’ లో ప్రతీ శని , ఆదివారం ప్రసారమయ్యే ‘డ్రామా జూనియర్స్ 9’ ప్రోగ్రాం ఎంతటి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. చిన్నారులు క్యూట్ క్యూట్ మాటలతో చేసే స్కిట్స్ ని చూస్తుంటే ‘వీళ్ళ వయస్సు ఏంటి?, ఈ టాలెంట్ ఏంటి?, ఇలాంటోళ్ళు కూడా ఉంటారా?’ అని ఆశ్చర్యపోక తప్పదు. ఇప్పటి వరకు 8 సీజన్స్ పూర్తి అయితే , చాలా మంది చిన్నారులు సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 9 కి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ షోకి సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా , అనిల్ రావిపూడి , శ్రీకాంత్ , రోజా వంటి వారు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే రీసెంట్ ఎపిసోడ్ లోని ఒక స్కిట్ సుడిగాలి సుధీర్ బండారం ని బట్టబయలు చేసింది.
సుధీర్ లో అందరికీ నచ్చే ఎలిమెంట్స్ లో ఒకటి ఆయన హెయిర్ స్టైల్. జబర్దస్త్ లోకి వచ్చిన కొత్తల్లో నుండి , ఇప్పటి వరకు ఆయన హెయిర్ స్టైల్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ రేంజ్ హెయిర్ స్టైల్ ఎలా మైంటైన్ చేస్తూ వస్తున్నావు అంటూ సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి అడిగేవారు నెటిజెన్స్. అయితే రీసెంట్ గా జరిగిన డ్రామా జూనియర్స్ ఎపిసోడ్ లో ఒక చిన్నారి సుధీర్ గెటప్ వేసుకొని వచ్చి , ఒక స్కిట్ చేసాడు. తనదైన పంచులతో ఆ చిన్నారి ఈ స్కిట్ లో దుమ్ము లేపేసాడు. అయితే ఆ చిన్నారి ఈ స్కిట్ లో ధరించిన విగ్ ని పీకేసాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఆ పిల్లాడు స్కిట్ లో చెప్పినట్టుగానే , సుధీర్ కి ఉన్నది నిజమైన జుట్టు యేనా అని రోజా అనుమానం వ్యక్తం చేసింది.
ఇన్ని రోజులు నీది నిజమైన జుట్టు అనుకున్నాము, కానీ అది విగ్గా ? అంటూ సుధీర్ ని ప్రశ్నించారు. రోజా చెప్పింది నిజమో కాదో తేల్చేస్తాము అని చెప్పి అనిల్ రావిపూడి , హీరో శ్రీకాంత్ స్టేజి మీదకు వెళ్తారు. అనిల్ రావిపూడి సుధీర్ జుట్టు ని పట్టుకొని లాగే ప్రయత్నం చేయగా, వద్దు బాబోయ్ అని సుధీర్ పక్కకి వెళ్తాడు. భయపడుతున్నాడంటే కచ్చితంగా ఇది చెక్ చెయ్యాల్సిందే అని అనిల్ రావిపూడి , శ్రీకాంత్ సుధీర్ జుట్టు ని పట్టుకుంటారు. ఆ తర్వాత అది నిజమైన జుట్టు అని తేలింది. ఈ స్కిట్ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేలా చేసింది.