Revanth Reddy:సిద్దిపేట సభలో హరీష్ రావు ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కూడా వదిలిపెట్టలేదు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి భాష గురించి.. మాట్లాడే విధానం గురించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఉత్తమమని వ్యాఖ్యనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పైగా రాజగోపాల్ రెడ్డి కి గులాబీ పార్టీ అనుకూల మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.
సిద్దిపేట సభలో రాజగోపాల్ రెడ్డి పేరును పరీక్షంగా ప్రస్తావించారు.. ఈమధ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో కొంతమందికి పిచ్చికుక్క కరిచినట్టు ఉందని.. మైకు ముందు పిచ్చి లేచినట్టు వాగుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చెడు మైక్ ముందు మాట్లాడుతూ.. మంచి తన చెవిలో చెబుతున్నారని అన్నారు. అటువంటివారిని ఉపేక్షించేది లేదని.. ఆ తరహా నాయకులను మా కార్యకర్తలు చూసుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా జోరుగా సాగడం లేదు. ఆ మధ్య ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం దుకాణాల విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో మద్యం షాపులు ఉండకూడదని.. బెల్ట్ దుకాణాలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగడంతో.. మునుగోడు నియోజకవర్గం లో వైన్ షాపులు నడుస్తున్నాయి. అయితే తనకు మంత్రి పదవి రాకపోవడం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని రాజగోపాల్ రెడ్డి అనుమానిస్తున్నారు. అందువల్లే అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులపాటు నిశ్శబ్దంగా ఉన్న రేవంత్ రెడ్డి.. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మీద తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం పిచ్చి కుక్క వరకే ఆగిపోతాయా.. లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే దాకా వెళ్తాయా అనేది చూడాల్సి ఉంది. ఈ విమర్శలుచేస్తూ ఎర్రగడ్డకు పంపిస్తానని కూడా రేవంత్ కోమటిరెడ్డికి హెచ్చరికలు పంపారు.
అయ్యప్ప భక్తులను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి 🚨🚨
అయ్యప్ప మాల వేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వామి ని ఎర్రోడు,ఎర్రికుక్క కరిచింది అని తిట్ల దండకం ఎత్తుకున్న సీఎం .
https://t.co/GB6qATF6BL— Santhosh (@santhoshadvocte) November 19, 2026