Homeబిజినెస్December 2026 car discounts: కారు కొనాలనుకుంటున్నారా? డిసెంబర్లో భారీ డిస్కౌంట్లు.. ఎంత ప్రయోజనం అంటే..

December 2026 car discounts: కారు కొనాలనుకుంటున్నారా? డిసెంబర్లో భారీ డిస్కౌంట్లు.. ఎంత ప్రయోజనం అంటే..

December 2026 car discounts: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ డిసెంబర్ నెల మీకు మంచి తరుణంగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఏడాది చివర్లో కార్ల కంపెనీలు.. డీలర్లు పాత స్టాక్ విక్రయించడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఈసారి కూడా డిసెంబర్ 2026లో కార్ల కొనుగోలుదారులకు ఆకట్టుకునే డిస్కౌంట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి.. హ్యుందాయ్.. టాటా మోటార్స్.. మహీంద్రా.. కియా వంటి కంపెనీల కార్లపై క్యాష్ డిస్కౌంట్లు.. ఎక్స్ చేంజ్ […]

December 2026 car discounts: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ డిసెంబర్ నెల మీకు మంచి తరుణంగా మారే అవకాశం ఉంది. సాధారణంగా ఏడాది చివర్లో కార్ల కంపెనీలు.. డీలర్లు పాత స్టాక్ విక్రయించడానికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ఈసారి కూడా డిసెంబర్ 2026లో కార్ల కొనుగోలుదారులకు ఆకట్టుకునే డిస్కౌంట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతి సుజుకి.. హ్యుందాయ్.. టాటా మోటార్స్.. మహీంద్రా.. కియా వంటి కంపెనీల కార్లపై క్యాష్ డిస్కౌంట్లు.. ఎక్స్ చేంజ్ బోనస్ లు.. కార్పొరేట్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డిసెంబర్ నెలలో ఎందుకంటే

ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ఆటోమొబైల్ కంపెనీలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. క్యాలెండర్ ఇయర్ ముగిసినందుకు ముందు విక్రయాల లక్ష్యాలను చేరుకోవడం.. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్ ను తగ్గించడం కంపెనీలకు అత్యంత అవసరం. అందుకే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి కంపెనీలు. ఇక అక్టోబర్ చివరి నాటికి దేశంలో ప్యాసింజర్ వెహికల్ ఇన్వెంటరీ 43 నుంచి 45 రోజుల స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో డీలర్లు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించే అవకాశం కల్పిస్తోంది.

మారుతి సుజుకి

స్విఫ్ట్.. వ్యాగన్ఆర్.. బాలెనో.. గ్రాండ్ విటారా వంటి మోడల్స్ మీద క్యాష్ డిస్కౌంట్ లో.. ఎక్స్ చేంజ్ బోనస్ లు.. కార్పొరేట్ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

హ్యుందాయ్

గ్రాండ్ ఐ టెన్ నియో.. ఆరా.. ఎక్స్ టర్, క్రెటా, వెర్నా వంటి కార్ల మీద ప్రత్యేకమైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత స్టాక్ మీద డీలర్లు అదనపు ప్రయోజనాలు అందించడానికి ఆస్కారం ఉంది.

టాటా మోటార్స్

టియాగో.. ఆల్ట్రోజ్.. నెక్సాన్.. కర్వ్.. హరియర్.. సఫారీ వంటి మోడల్స్ మీద క్యాష్ డిస్కౌంట్లు.. ఎక్స్ చేంజ్ బెనిఫిట్స్ అందుబాటులోకి రావచ్చు ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా ప్రత్యేకమైన ఆఫర్లు లభించే అవకాశం ఉంది

మహీంద్రా

ఎక్స్ యు వి 3XO, స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ వంటి మోడల్స్ మీద ఎంపిక చేసిన వేరియంట్లకు డీలర్ ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఇటీవల పండుగ సమయంలో కంపెనీలు కార్ల మీద డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో కంపెనీలు ఈ స్థాయిలో ప్రయోజనాలు అందిస్తున్నాయి.

డిస్కౌంట్ లభించినతమాత్రాన కస్టమర్లు ఈ క్రింది విషయాలను మర్చిపోవద్దు.. కారు తయారీ అయిన నెల.. సంవత్సరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్యాష్ డిస్కౌంట్ ఎంత లభిస్తోంది.. ఎక్స్ చేంజ్ బోనస్ ఎంత లభిస్తోంది.. విడివిడిగా ఎంత అడగాలి అనేది తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్.. యాక్సెసరీస్ ఖర్చులను పరిశీలించాలి. కొత్త సంవత్సరం మోడల్ తో ధర.. రీ సేల్ విలువ ను అంచనా వేయాలి. డీలర్ ఇచ్చే ఆఫర్లు అన్ని ప్రయోజనాలు లభిస్తాయో లేదో తెలుసుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్లో కారు కొనుగోలు చేస్తే దాని రిజిస్ట్రేషన్ సంవత్సరం 2026 గా ఉంటుంది. జనవరి 2027లో కొనుగోలు చేస్తే 2027 రిజిస్ట్రేషన్ లభిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో కారును విక్రయించే సమయంలో ఈ సంవత్సరానికి సంబంధించిన అంశం ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper