Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: త్రిగున్ సీక్రెట్స్ మొత్తం లీక్ చేసేసిన రోహిత్..అసలైన యుద్ధం మొదలైంది!

Bigg Boss 10 Telugu: త్రిగున్ సీక్రెట్స్ మొత్తం లీక్ చేసేసిన రోహిత్..అసలైన యుద్ధం మొదలైంది!

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా భారీ హైప్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ నాయుడు, మొదటి ఎపిసోడ్ నుండే తనదైన మార్కు చూపిస్తూ , టాప్ కంటెస్టెంట్ గా నెంబర్ 1 ఓటింగ్ తో కొనసాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ కంటెస్టెంట్స్ కుట్రలు చేసి , అతనికి వ్యతిరేకంగా ఓటు వేసి , బయటకి వెళ్లిపోయేలా చేశారు. రీ […]

Bigg Boss 10 Telugu: ఈ సీజన్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా భారీ హైప్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోహిత్ నాయుడు, మొదటి ఎపిసోడ్ నుండే తనదైన మార్కు చూపిస్తూ , టాప్ కంటెస్టెంట్ గా నెంబర్ 1 ఓటింగ్ తో కొనసాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ కంటెస్టెంట్స్ కుట్రలు చేసి , అతనికి వ్యతిరేకంగా ఓటు వేసి , బయటకి వెళ్లిపోయేలా చేశారు. రీ ఎంట్రీ పై అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు కానీ, అది అసాధ్యమని స్వయంగా రోహిత్ చెప్పడంతో, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వని రోహిత్, నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి త్రిగున్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ముందుగా త్రిగున్ పీఆర్ టీం కి రోహిత్ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నేను ఇప్పుడు హౌస్ లో లేను, మీ వాడిని గెలిపించుకోవడానికి ఏదైనా చేసుకోండి , అది మీ ఇష్టం, కానీ నా ఫ్యామిలీ ని లాగి కొంతమంది త్రిగున్ పీఆర్ కి సంబంధించిన వాళ్ళు ఇష్టమొచ్చినట్టు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇంకోసారి అలా చేస్తే చూస్తూ ఊరుకోను, నేరుగా మీ ఇంటికి వచ్చి మీ బాగోతాలు మొత్తం బయటపెడుతాను జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. అంతే కాకుండా త్రిగున్ ఆ స్థాయిలో దిగజారిపోవడానికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చాడు రోహిత్. ఒకరోజు నాతో త్రిగున్ మాట్లాడుతూ , పాజిటివ్ అయినా , నెగెటివ్ అయినా జనాల్లోకి వెళ్లడమే నా టార్గెట్ అని అన్నాడు , ఇప్పుడు ఆయనది జంగా అనే సినిమా విడుదలకు దగ్గర్లో ఉంది కదా, బహుశా ఆ సినిమా కోసమే ఇలా చేస్తున్నట్టు ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్.

అంతే కాకుండా హౌస్ నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా త్రిగున్ రోహిత్ పై కొన్ని అసత్య ప్రచారాలు చేసాడు. దీనిపై రోహిత్ స్పందిస్తూ అతనికి ఇంత వయసొచ్చింది, 35 సినిమాలు చేసి వచ్చాను అంటాడు, జీవితం లో ఎన్నో చూసి వచ్చానని అంటాడు, కానీ ఇంత దిగజారుడు ప్రవర్తన ఎంతో అంటూ చెప్పుకుకొచ్చాడు. జనాలు చూస్తున్నారే, ఇలా ఇష్టమొచ్చినవి ప్రచారం చేస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని అడుగుతారు కదా అనే సెన్స్ కూడా అతనికి లేదు అంటూ చాలా తీవ్ర స్థాయిలో రోహిత్ స్పందించాడు. ఇక అమన్ చేసిన వెన్నుపోటు గురించి ఒక మీడియా రిపోర్టర్ అడుగుతూ అమన్ త్రిగున్ తో చేతులు కలపడానికి గల కారణం సినిమా అవకాశాల కోసమే అని మాకు అనిపిస్తుందని, ఎందుకంటే ఆయన 35 సినిమాలు చేసాడు, ఇండస్ట్రీ లో పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, అతనితో ఉంటే లాభాలు ఉంటాయి , రోహిత్ తో ఉండడం వల్ల అతనికి లాభాలు కనిపించకపోవచ్చు , అందుకే అతను త్రిగున్ తో చేతులు కలిపి ఉంటాడని రిపోర్టర్ అడగ్గా , ఈ కోణం లో నేను ఇప్పటి వరకు ఆలోచించలేదు , మీరు చెప్తుంటే నిజమేనని అనిపిస్తోంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇలా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒకే ఒక్క మీడియా సమావేశం తో సోషల్ మీడియా ని షేక్ అయ్యేలా చేసాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper