Chiranjeevi: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో ఒకప్పటి ఎనర్జీ , జోష్ అసలు కనిపించడం లేదు. ఆయన ప్రసంగాలు ఒకప్పుడు వేరే లెవెల్ లో ఉండేవి, కానీ ఇప్పుడు ఆ ఎనర్జీ , దూకుడు అసలు కనిపించడం లేదు. చాలా కూల్ గా మాట్లాడుతున్నాడు. అంతే కాకుండా ఆయన ముఖం లో చిరునవ్వు దూరమై చాలా రోజులైంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడో, పవన్ కళ్యాణ్ కూడా అలాగే ఉంటున్నాడు. అభిమానులు ఆయన్ని అలా చూడలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా అవ్వడానికి ముఖ్య కారణం విడాకులు తీసుకోవడమే. అన్నా లెజినోవా తో విడిపోయినప్పటి నుండి పవన్ కళ్యాణ్ చాలా డిప్రెషన్ కి గురైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొంటున్నప్పటికీ, ఒకప్పటి దూకుడు కనిపించడం లేదు. ఆయన కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు ,కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనిలాగా అనిపించడం లేదు. అందుకు రీసెంట్ గా ఒక సంఘటన ఉదాహరణ గా నిల్చింది.
నెట్ ఫ్లిక్స్ సంస్థ మెగాస్టార్ చిరంజీవి తో ‘మెగా వర్స్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో లో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ లతో కలిసి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. మెగాస్టార్ స్పెషల్ రిక్వెస్ట్ మీద పవన్ కళ్యాణ్ ఈ టాక్ షో లో పాల్గొనడానికి ముందుగా ఆసక్తి చూపించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కి రాలేనని , దయచేసి నన్ను క్షమించండని చిరంజీవి తో చెప్పాడట. దీంతో ఈ ఇంటర్వ్యూ మొత్తం క్యాన్సిల్ అయ్యిందని అంటున్నారు. స్వయానా తాను దైవం లాగా భావించే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ ని కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసాడంటే, ఆయన మానసిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అభిమానులు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కలిసి కాసేపు సరదాగా చిట్ చాట్ చేస్తుంటే చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ ఆ ఆశలన్నీ ఇప్పుడు ఆవిరి అయిపోయాయి. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సందర్భం వస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి.
ఒకపక్క రాజకీయ ఒత్తిడి, మరోపక్క మానసిక ఒత్తిడి, పవన్ కళ్యాణ్ ఈ రెండిటిని ఎలా బ్యాలన్స్ చేస్తున్నాడో, భవిష్యత్తులో ఆయనకు వీటిని భరించడానికి ఆ దేవుడు మరింత శక్తి ని ఇవ్వాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. బాధ్యతలు మొత్తం సోదరుడు నాగబాబు, నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ లకు అప్పించాడు. సీట్ల సర్దుబాటు చర్చల్లో వీళ్ళే చంద్రబాబు తో నేరుగా పాల్గొన్నారు కానీ , పవన్ కళ్యాణ్ పెద్దగా పాల్గొనలేదు. పార్టీ కి ఎంతో కీలకమైన ఎన్నికలు అయ్యినప్పటికీ కూడా ఆయన ఇలా ఉన్నాడంటే ఏ స్థాయి డిప్రెషన్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు కారణంగా, జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. రాబోయే మున్సిపల్ , సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ చరిత్ర తిరగరాస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.