Homeటాప్ స్టోరీస్Aakasamlo Oka Tara Movie Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ: హిట్టా? ఫట్టా?

Aakasamlo Oka Tara Movie Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ: హిట్టా? ఫట్టా?

Aakasamlo Oka Tara Movie Review:తెలుగు ప్రేక్షకులకు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సుపరిచితులే. మహానటి సినిమా ద్వారా ఆయన ఇక్కడ ప్రేక్షకుల మనసులో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. మహానటి కంటే ముందు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో బాగానే ఆడాయి. దీంతో దుల్కర్ సల్మాన్ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని తెలుగు ప్రేక్షకులకు ఒక గట్టి నమ్మకం. అందువల్లే తెలుగులో ఆయన నేరుగా సినిమాలు తీస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా ద్వారా […]

Aakasamlo Oka Tara Movie Review:తెలుగు ప్రేక్షకులకు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సుపరిచితులే. మహానటి సినిమా ద్వారా ఆయన ఇక్కడ ప్రేక్షకుల మనసులో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. మహానటి కంటే ముందు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో బాగానే ఆడాయి. దీంతో దుల్కర్ సల్మాన్ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని తెలుగు ప్రేక్షకులకు ఒక గట్టి నమ్మకం. అందువల్లే తెలుగులో ఆయన నేరుగా సినిమాలు తీస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా ద్వారా తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నారు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తాజాగా ఆకాశంలో ఒక తార అనే సినిమా ద్వారా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది.. మరోసారి దుల్కర్ సల్మాన్ మ్యాజిక్ రిపీట్ అయిందా.. ఈ రివ్యూలో తెలుసుకుందాం.

అమ్మాయిల కలలు.. వాటి ఆశయాలను నిజం చేసుకోవడానికి జరిపే పోరాటం నేపథ్యంలో రూపొందింది ఆకాశంలో ఒక తార అనే సినిమా. సాత్విక వీరవల్లి అనే తెలుగు అమ్మాయి ఈ సినిమాలో కథానాయకగా నటించింది. శృతిహాసన్, రుహాని శర్మ, శ్వాసిక ముఖ్యపాత్రలు పోషించారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించారు.. ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్ అందించారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ.. సందీప్ గుణం.. రమ్య గుణం ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.

కథ విషయానికొస్తే మారుమూల గ్రామంలో నివసించే కల్పన (సాత్విక వీరవల్లి) కు చిన్నప్పటినుంచి ఆస్ట్రోనాట్ కావాలి అనే కల ఉంటుంది. ఆకాశంలోకి వెళ్లి అంతరిక్షాన్ని చూడాలి అనే ఆమె ఆశయం చాలా పెద్దది. కానీ ఆమె కుటుంబ పరిస్థితులు.. ముఖ్యంగా తండ్రి ఆలోచన విధానం ఆమె కలలకు అడ్డుగా నిలుస్తాయి. ఆడపిల్లకు చదువు ఎందుకని భావనతో కల్పనకు చదువును దూరం చేస్తాడు తండ్రి. చివరకు ఆమెకు చిన్న వయసులోనే కృష్ణ (దుల్కర్ సల్మాన్) తో వివాహం జరుగుతుంది. దీంతో ఇక తన కలలు నెరవేరవని కల్పన భావిస్తుంది.

కృష్ణ ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.. భార్య ఆశయాన్ని అర్థం చేసుకున్న అతడు ఆమె కలలను నిజం చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు దీనికోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ ప్రయాణంలో కల్పనకు ఎదురైన సవాళ్లు ఏమిటి.. ఆమె ఆస్ట్రోనాట్ అవ్వాలి అనే లక్ష్యాన్ని చేరుకుందా.. అనేది మిగతా కథ..

కథనం ఎలా ఉందంటే

ఒక అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలి అనేకలను కేంద్రంగా చేసుకొని దర్శకుడు పవన్ సాధనేని మంచి భావోద్వేగ ఫలితమైన కథను ఎంచుకున్నాడు. మొదటి భాగంలో కల్పన బాల్యం.. ఆమె ఆశయం.. కుటుంబ పరిస్థితులు.. కృష్ణతో వివాహం వంటి అంశాలతోనే సాగుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు డాక్యుమెంటరీ చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. కథలో వేగం తగ్గడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.

సెకండ్ హాఫ్ లో కల్పన లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు.. ఎదురయ్యే అడ్డంకులు.. ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా శృతిహాసన్ రావడంతో కథనం కొత్త మలుపు తీసుకుంటుంది. చివరి భాగంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఆర్ట్ ఫిలిం చూసిన అనుభూతి కలిగిస్తాయి. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు కనిపిస్తాయి.

దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో గొప్పగా నటించలేదు. ఆయన నటన పాత సినిమాలను గుర్తుకు తీసుకొస్తుంది. తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి, శృతిహాసన్.. శ్వాసిక.. రుహాని శర్మ తమ పాత్రల పరిధిలో నటించారు..

బలాలు

దుల్కర్ సల్మాన్ నటన
సాత్విక వీరవల్లి పెర్ఫార్మన్స్
భార్యాభర్తల మధ్య వచ్చే సన్నివేశాలు

బలహీనతలు

మొదటి భాగంలో నెమ్మదిగా సాగే కథనం
కొన్నిచోట్ల సాగదీసినట్టు ఉంటే సన్నివేశాలు
విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం
కథలో కొన్ని పరిణామాలు ముందే ప్రేక్షకులు అంచనా వేయగలగడం

ఫైనల్ గా చెప్పాలంటే నెమ్మదిగా సాగే కథ. ఎంటర్టైన్మెంట్ పెద్దగా ఉండదు. ఈ కాలపు జన్ జెడ్ ఆడియన్స్ పెద్దగా ఎక్కదు. పైగా ఇటువంటి స్టోరీలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కథలో ప్రేక్షకులను లీనం చేయాలంటే దానికి తగ్గట్టుగా వినోదం ఉండాలి. కానీ అందులో దర్శకుడు తడబడ్డాడు. భావోద్వేగం మీద ఆధారపడిన దర్శకుడు.. వినోదాన్ని పూర్తిగా మర్చిపోయాడు.

ఈ సినిమాకు ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5/5.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper