Homeఎంటర్టైన్మెంట్Allu Arjun : అల్లు అర్జున్ విషయంలో క్లారిటీ తప్పుతున్న స్టార్ డైరెక్టర్...

Allu Arjun : అల్లు అర్జున్ విషయంలో క్లారిటీ తప్పుతున్న స్టార్ డైరెక్టర్…

Allu Arjun : ‘గంగోత్రి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు అల్లు అర్జున్… మొదటి సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో చేసిన ‘ఆర్య’ సినిమాతో భారీ క్రేజ్ ను అందుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా అవతరించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ఆయన పుష్ప సినిమాలో నటించినందుకు గాను ‘నేషనల్ అవార్డు’ ని […]

Allu Arjun : ‘గంగోత్రి’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు అల్లు అర్జున్… మొదటి సినిమా సక్సెస్ అయిన కూడా అతనికి ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో చేసిన ‘ఆర్య’ సినిమాతో భారీ క్రేజ్ ను అందుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా అవతరించడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ఆయన పుష్ప సినిమాలో నటించినందుకు గాను ‘నేషనల్ అవార్డు’ ని కూడా అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కొంతమంది దర్శకులు అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తుంటే మరి కొంతమంది మాత్రం అల్లు అర్జున్ తో సినిమాలు చేయడం ఎందుకు అంటూ ఆగిపోతున్నారట. మలయాళం దర్శకుడు బాసిల్ జోసెఫ్ సైతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. బాసిల్ జోసఫ్ సైతం ఇంతకుముందు కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

అల్లు అర్జున్ కి ఆయన ఎలాంటి కథను చెప్పి ఒప్పిస్తాడు. తనతో సినిమా చేయడం అంటే అంతా ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎందుకంటే అతనికి పామ్ ఇండియాలో భారీ మార్కెట్ ఉంది. పుష్ప 2′ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాలు అంతకు మించి వసూళ్లను రాబట్టే విధంగా ఉండాలి.

కానీ అంతకంటే తక్కువ కలెక్షన్స్ ను తీసుకువచ్చే విధంగా ఉండకూడదని ఆయన భావిస్తున్నారట. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బాసిల్ జోసెఫ్ థ్రిల్లర్ సినిమాలో నటింపజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా భారీ బడ్జెట్లో ఉండబోతుందట.

అలాంటి డిఫరెంట్ జానర్స్ లో అల్లు అర్జున్ నటిస్తే చూడాలని కొంతమంది భావిస్తుంటే ఇంకొంతమంది మాత్రం అలాంటి జానర్స్ లో అల్లు అర్జున్ అస్సలు సెట్ అవ్వడని, ఆయనతో సీరియస్ మూడ్ లో ఉండే సినిమాలను చేయడం కంటే కమర్షియల్ హంగులతో ఉన్న సినిమాలను చేసుకుంటూ వెళ్తేనే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper