Raaka Movie: ‘ ‘పుష్ప 2’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం ‘రాకా’. తమిళ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గానే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం గురించి అనేక షాకింగ్ విషయాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే 1000 కోట్ల రూపాయిలు దాటింది అట. బడ్జెట్ కి తగ్గట్టుగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదని , అందుకే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మేకర్స్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ వార్తలు ప్రచారం లో ఉండగానే , మరో రూమర్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అయితే ఇంకా ఆయనకు పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వలేదని , త్వరలోనే విదేశాల్లో ఏర్పాటు చేసిన షెడ్యూల్ లో షారుఖ్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. గతం లో డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ అనే చిత్రం చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
ఈ సినిమా షూటింగ్ సమయం నుండే అట్లీ తో షారుఖ్ ఖాన్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ‘రాకా’ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు కూడా షారుఖ్ ఆ చిత్రం గురించి ప్రత్యేకంగా ట్వీట్ కూడా వేశారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం వల్లే , ఇప్పుడు ‘రాకా’ లో అతిథి పాత్ర చేయడానికి షారుఖ్ ఒప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ చిత్రం లో కూడా షారుఖ్ ‘జవాన్’ పాత్రలోనే కనిపించబోతున్నట్టు టాక్. లోకేష్ కనకరాజ్ తరహా లో ‘రాకా’ కి ‘జవాన్’ ని లింక్ చేసి , ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని వినికిడి. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కుతాయి అనుకోవచ్చు.