Homeఅంతర్జాతీయంJapan earthquake : కళ్ళముందే భారీ భూకంపం.. వీళ్ళు చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..

Japan earthquake : కళ్ళముందే భారీ భూకంపం.. వీళ్ళు చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..

Japan earthquake : వైద్యులను కనిపించే దేవుళ్ళు అంటారు. వైద్యం అనేది కమర్షియల్ అయిపోయినప్పటికీ.. పేషెంట్లను కేవలం కాసులు కురిపించే యంత్రాలుగానే వైద్యులు చూస్తున్నప్పటికీ.. కొంతమంది వైద్యులు మాత్రం అలా కాదు. వారికి సేవే లక్ష్యం. చికిత్స మాత్రమే మార్గం. అది జపాన్ దేశం.. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. అక్కడ భూకంపాలు కొత్త కాదు. ఎర్త్ మూమెంట్స్ ను బట్టి అక్కడ నష్టం ఉంటుంది. అందువల్లే అక్కడి ప్రజలు కూడా అక్కడి […]

Japan earthquake : వైద్యులను కనిపించే దేవుళ్ళు అంటారు. వైద్యం అనేది కమర్షియల్ అయిపోయినప్పటికీ.. పేషెంట్లను కేవలం కాసులు కురిపించే యంత్రాలుగానే వైద్యులు చూస్తున్నప్పటికీ.. కొంతమంది వైద్యులు మాత్రం అలా కాదు. వారికి సేవే లక్ష్యం. చికిత్స మాత్రమే మార్గం.

అది జపాన్ దేశం.. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. అక్కడ భూకంపాలు కొత్త కాదు. ఎర్త్ మూమెంట్స్ ను బట్టి అక్కడ నష్టం ఉంటుంది. అందువల్లే అక్కడి ప్రజలు కూడా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గృహాలను నిర్మించుకుంటారు. ఇటీవల జపాన్ దేశంలోని కుమా మోటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ సమయంలో దేశం మొత్తం వణికిపోయింది. కానీ వీళ్ళు చేసిన పని మాత్రం చేతులెత్తి మొక్కేలా చేసింది.

కుమ మోటో ప్రాంతంలో వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.1 నమోదయింది. దీని తీవ్రత వల్ల ఓ ఆసుపత్రి భవనం పూర్తిగా ఊగిపోయింది. ప్రాణాలను అరచేతులో పెట్టుకుని అందరూ పరుగులు పెట్టలేదు. ముఖ్యంగా ఆసుపత్రి భవనం ప్రమాదకరస్థాయిలో ఊగిపోతున్నప్పటికీ అక్కడి వైద్యులు లెక్కచేయలేదు. వైద్యులు.. నర్సులు.. రోగి ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆస్పత్రి భవనం మొత్తం ఊగిపోతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఆ రోగికి అండగా నిలిచారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. దీనికి సంబంధించి సీసీటీవీ వీడియోలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి.

మీరు కనిపించే దేవుళ్ళు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు చూపించిన తెగువ చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది. వైద్యం అంటే కేవలం కమర్షియల్ మాత్రమే కాదు. సర్వీస్ కూడా. దానిని మీరు చేసి చూపించారు. మీరు చూపించిన గొప్పతనం.. దార్శనికత అద్భుతమైనది. ఇంతకంటే చెప్పాల్సిందేముంది మీకు చేతులెత్తి మొక్కడం తప్ప అంటూ.. నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ దేశంలో ఇటువంటి భూ కంపాలు సర్వసాధారణం.అయినప్పటికీ అక్కడి వైద్యలు ఏమాత్రం భయపడకుండా వారి విధులను నిర్వహించారు. రోగికి ఆపరేషన్ చేశారు.అతడి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టారు. వైద్యం అనేది గొప్పదని, వైద్యలు అంతకుమించిన గొప్పవాళ్లని నిరూపించారు. అయితే భూంకపం తీవ్రతకు ఆసుపత్రి భవనం ఊగిపోయినప్పటికీ, నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత వల్ల అది కూలిపోకుండా అలాగే నిలబడగలిగింది. కాకపోతే భూకంపం తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రి వనం అటూఇటూ ప్రమాదకరస్థాయిలో ఊగిపోయింది. చూసేవాళ్లకు వెన్నులో వణుకు పుట్టింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper