Homeవింతలు-విశేషాలుViral Train Video: ఏడిపించిన పాపానికి.. మగాడిని ఆడపిల్లను చేసేసింది ఈ యువతి

Viral Train Video: ఏడిపించిన పాపానికి.. మగాడిని ఆడపిల్లను చేసేసింది ఈ యువతి

Viral Train Video: పెదాలకు లిప్ స్టిక్ పూసింది. ముఖానికి పౌడర్ రాసింది. అందంగా ముస్తాబు చేసింది.. వాస్తవానికి ఇవన్నీ ఒక ఆడపిల్ల పూసుకుంటే బాగుంటుంది. ఒక మగాడు రాసుకుంటే మాత్రం ఈ సమాజం తేడాగా చూస్తుంది. అలాగని అతడు తేడా గాడు కాదు. మగాడే.. కాకపోతే ఇవన్నీ పూసి తేడా గాడిని చేసింది.. ఎందుకిలా చేసింది.. ఆమె అలా చేస్తుంటే అతడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. అతను చూడ్డానికి […]

Viral Train Video: పెదాలకు లిప్ స్టిక్ పూసింది. ముఖానికి పౌడర్ రాసింది. అందంగా ముస్తాబు చేసింది.. వాస్తవానికి ఇవన్నీ ఒక ఆడపిల్ల పూసుకుంటే బాగుంటుంది. ఒక మగాడు రాసుకుంటే మాత్రం ఈ సమాజం తేడాగా చూస్తుంది. అలాగని అతడు తేడా గాడు కాదు. మగాడే.. కాకపోతే ఇవన్నీ పూసి తేడా గాడిని చేసింది.. ఎందుకిలా చేసింది.. ఆమె అలా చేస్తుంటే అతడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

అతను చూడ్డానికి అందంగా ఉంటాడు. ఆరడుగుల ఎత్తు ఉంటాడు. కానీ అతని రూపానికి.. బుద్ధికి చాలా తేడా ఉంది. కురచ బుద్ధి ఉన్న అతడు.. ఆడపిల్లను చూడగానే రెచ్చిపోయాడు. తనలో ఉన్న మృగాడిని బయటపెట్టాడు. కదులుతున్న రైలులో ఆ అమ్మాయిని వేధించాడు. మొదట్లో ఆ అమ్మాయి అతని వేధింపులను పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ధైర్యంగా ఎదురు తిరిగింది. ఆమెకు తోటి ప్రయాణికులు కూడా తోడయ్యారు. దీంతో అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.

ఈ సంఘటన భూసవాల్.. వర్ధ ప్యాసింజర్ రైలులో చోటుచేసుకుంది. ఒక యువతిపై ఓ ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే ఆ యువతి చూస్తూ ఊరుకోలేదు. మౌనంగా భరించలేదు. తీవ్రస్థాయిలో ప్రతిఘటించింది. తెగువను చూపించింది. అతడికి చుక్కలు చూపించింది. అంతటితోనే ఆగలేదు. ఏ మగతనాన్ని చూసుకొని అతడు మురిసిపోతున్నాడు.. దానికి ఆడతనాన్ని జోడించింది. ఆడవాళ్లు ముఖానికి రాసుకునే పౌడర్.. పెదాలకు అద్దుకునే లిప్స్టిక్ పూసేసింది. ఈ వ్యవహారాన్ని మొత్తం ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలింది.

ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆడపిల్లలకు తోటి ప్రయాణికులు అండగా నివాసన అవసరాన్ని ఈ సంఘటన నిరూపించింది. నేరస్తులను చట్టానికి పట్టించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది. ప్రజా రవాణా వ్యవస్థలలో ప్రయాణించే మహిళల కోసం అధికారులు తక్షణమైన రక్షణ చర్యలు కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన తెలియజేస్తోంది. కాగా ఆ యువతి చూపించిన తెగువ చాలామందికి ధైర్యాన్ని కలిగిస్తోంది. ఒక అమ్మాయి..అందులోనూ ఒక పోకిరి వ్యతిరేకంగా పోరాడటం నిజంగా హ్యాట్సాఫ్. పైగా అతడిని ఏమాత్రం భయపడకుండా నిలదీసింది. అతడికి చుక్కలు చూపించింది. పైగా మరో ఆడపిల్ల జోలికి పోకుండా గట్టిగా బుద్ధి చెప్పింది. దీంతో అతడు చేసిన తప్పును తలచుకుని కుమిలికుమిలి ఏడ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper