Prabhas: ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రభాస్… ముఖ్యంగా పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించాడు. ఆ సినిమాతోనే తెలుగు హీరోలు సైతం పాన్ ఇండియాలో రాణించవచ్చు అని ప్రూవ్ చేసిన నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గతంలో అల్లు అర్జున్ సైతం ప్రభాస్ ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్లు చేశాడు. బిల్లా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ మన ప్రభాస్ బాలీవుడ్ లో ఉన్న హృతిక్ రోషన్ కంటే మంచి నటుడు… ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు పనికిరాడు అంటూ కొన్ని కామెంట్లు చేశాడు. నిజానికి అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ లో వాస్తవ ఉందని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ అది ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల లైనప్ అయితే చాలా అద్భుతంగా ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా డిసెంబర్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా 2027 వ సంవత్సరం మార్చి 5వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.
ఈ రెండు సినిమాలతో మరోసారి ఆయన తన స్టామినాను చూపిస్తే మాత్రం స్టార్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డౌన్ అయిపోయే పరిస్థితి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాల తర్వాత ఆయన కల్కి 2, సలార్ 2 సినిమాలను చేయబోతున్నాడు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మరో ఇద్దరు దర్శకులతో కొత్త సినిమాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
ఇక ఇదిలా ఉంటే అప్పట్లో అల్లు అర్జున్ ప్రభాస్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులైతే ఆ వీడియోలను షేర్ చేస్తూ చాలావరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు…