Toddy Tree CCTV : దొంగతనానికి కాదేది అర్హం.. అని అంటుంటారు. కొందరు ఏది వీలైతే దానినే దొంగతనం చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో చాలా మంది దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంటి సముదాయాల్లో.. వ్యాపార స్థలాల్లో దొంగల బారి నుంచి రక్షించుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు తాటి చెట్లెక్కాయి. దీనిని చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు సీసీ కెమెరాలు తాటి చెట్లు ఎందుకు ఎక్కాయి? వీటిని గీత కార్మికులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు?
తెలంగాణ రాష్ట్రంలోని ఓ తాటి చెట్టుపై ఉన్న సీసీ కెమెరాల గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు అనే గ్రామంలో అన్నెపు శ్రవణ్ గౌడ్ అనే గీత కార్మికుడు తన తాటి చెట్టుకు సీసీ కెమెరాలను అమర్చాడు. సాధారణంగా తాటిచెట్టుపై కల్లు ఉంటుంది.. లేదా తాటి ముంజలు ఉంటాయి. కానీ ఈ సీసీ కెమెరాలు ఉండడమేంటి? అని అనుకుంటుండగా.. అసలు విషయాన్ని ఆ గీత కార్మికుడు వివరించాడు.
గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతలో కొందరు కల్లును ఎత్తుకెళ్తున్నారట. ఎంతో కష్టపడి కల్లు గీసి వెళ్తె.. మరుసటి రోజు వచ్చి చూసేవరకు ఖాళీ కుండలు కనిపిస్తున్నాయట. ఇది కచ్చితంగా దొంగల పనే అని భావించిన అతను తన చెట్టుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. దీంతో తన కల్లును ఎవరు దొంగిలిస్తున్నారో తెలుసుకోవచ్చని అయన చెబుతున్నాడు. అయితే చాలా మంది ఈ సమస్యలు ఎదుర్కొన్నా.. పరిష్కారం దొరకలేదు. శ్రవణ్ చేసిన ఈ పనికి తోటి గీత కార్మికులు మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా తాము కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటామని చెబుతున్నారు.
అయితే ఈ సీసీ కెమెరాలను సైతం సరైన విధంగా అమర్చుకోవాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే కొందరు ముసుగు వేసుకొని సీసీ కెమెరాలను ద్వంసం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల వీటిని ఏర్పాటు చేయడమే కాకుండా వీటి వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అంటున్నారు. ఏదీ ఏమైనా శ్రవణ్ ఏర్పాటు చేసుకొన్న ఈ సీసీ కెమెరాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కల్లు గీస్తే దొంగలు ఎత్తుకెళ్తున్నారని ఏకంగా తాటిచెట్టుకే సీసీ కెమెరాను ఏర్పాటు చేసిన గీత కార్మికుడు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో గీత కార్మికుడు అన్నెపు శ్రవణ్ గౌడ్ వినూత్నంగా ఆలోచించాడు. రాత్రిళ్లు గీసిన కల్లును గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్తుండటంతో, వారిని… pic.twitter.com/eiN85ZVSza
— Tupaki (@tupaki_official) August 7, 2026