Varun Tej : వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి , కచ్చితంగా వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతా బాగానే ఉంది కానీ , ఈరోజు ఉదయం నుండి ఈ సినిమాలోని ఒక సన్నివేశం నందమూరి ఫ్యాన్స్ కి తీవ్రమైన కోపం రప్పించేలా చేసింది. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోయిన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ని ఒక సినిమాలో ఇలా అవమానించడం ఏ మాత్రం బాగాలేదని, దీనిపై మూవీ టీం తక్షణమే క్షమాపణలు చెప్పి , ఆ సన్నివేశాన్ని సినిమా నుండి తొలగించాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ ఉదయం నుండి పెద్ద రచ్చ చేశారు.
అయితే దీనిపై కాసేపటి క్రితమే వరుణ్ తేజ్ , డైరెక్టర్ మేర్లపాక గాంధీ వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో సక్సెస్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయగా, అక్కడ జరిగిన విలేఖరుల సమావేశం లో వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ ‘వాస్తవానికి ఆ సన్నివేశాన్ని నవంబర్ లో షూట్ చేశాము , ఒకటే క్లారిటీ ఇస్తున్నాము , మేము ఎవరినీ ట్రోల్ చెయ్యలేదు , ట్రోలింగ్ కి ఇమిటేషన్ కి చాలా తేడా ఉంటుంది, గొప్ప గొప్ప ఆర్టిస్టులను ఇమిటేట్ చేయడం మన ఇండస్ట్రీ లో కొత్తేమి కాదు. నేను చేసిన F3 సినిమాలో కళ్యాణ్ గారి వకీల్ సాబ్ ని కూడా ఇమిటేట్ చేశాము , అలాగే ఇది కూడా చాలా హెల్తీ స్పేస్ లోనే చేసాము , ఒకరిని తక్కువ చేసే ఉద్దేశ్యమే మాకు లేదు. మా ప్రమోషన్ మెటీరియల్ లో కూడా కృష్ణ గారిని , చిరంజీవి గారిని ఇమిటేట్ చేసిన షాట్స్ పెట్టాము, ఇదంతా కేవలం ఫన్ కోసం చేసిందే తప్ప ట్రోల్ చేయడం కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే దీనికి రిపోర్టర్ మరో ప్రశ్న అడుగుతూ ‘సోషల్ మీడియా లో మాత్రం నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ని అవమానించినట్టుగా తీసుకొని మిమ్మల్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు, ట్రోల్స్ అవుతున్నాయి’ అని చెప్పగా , అందుకు వరుణ్ తేజ్ సమాధానం చెప్తూ ‘అవ్వనివ్వండి..ఏమి చేస్తాం.. కావాలని మేము చెయ్యలేదు , ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యం లేదు, సత్య కి ఇలాంటి ఇమిటేషన్ చేయడం కొత్తేమి కాదు , మాకు మాత్రం అగౌరవపర్చాలనే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Sr. NTR ట్రోల్ సీన్‌పై వివరణ:
VT: ఆ సీన్‌ను Novemberలోనే షూట్ చేశాం. Trollingకి imitationకి తేడా ఉంది.
Director: Theatreలో జనాలు ఆ సీన్‌ను ఫుల్ గా enjoy చేస్తున్నారు.#KoreanKanakaraju pic.twitter.com/o3GK02FqPk
— M9 NEWS (@M9News_) August 7, 2026