Homeఆధ్యాత్మికంIRCTC Tour Package : ఏడు జ్యోతిర్లింగాలను ఓకే సారి ఇలా దర్శించుకోవచ్చు

IRCTC Tour Package : ఏడు జ్యోతిర్లింగాలను ఓకే సారి ఇలా దర్శించుకోవచ్చు

IRCTC Tour Package :  దేశంలోని దేవాలయాలను సందర్శించాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలామంది ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుంటారు. కానీ అన్ని సమయాలు.. అన్ని రూట్లు ఒకేసారి వెళ్లడం కొందరికి సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఒక కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 7 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఒకే యాత్రలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న నేడు జ్యోతిర్లింగాలను […]

IRCTC Tour Package :  దేశంలోని దేవాలయాలను సందర్శించాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చాలామంది ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుంటారు. కానీ అన్ని సమయాలు.. అన్ని రూట్లు ఒకేసారి వెళ్లడం కొందరికి సాధ్యం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఒక కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 7 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఒకే యాత్రలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న నేడు జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించుకోవచ్చు. ఈ యాత్ర ఎలా సాగుతుంది? దీని టికెట్ వివరాల్లోకి వెళితే..

IRCTC తెలిపిన వివరాల ప్రకారం ఈ యాత్ర మొత్తం పది రాత్రులు, 11 పగళ్ళు ఉంటాయి. ప్రయాణికులు పెంచుకున్న ప్రకారం టూ టైర్ ఏసీ, త్రీ టైర్ ఏసీల్లో ప్రయాణం చేయవచ్చు. టికెట్ ధరలు రూ.88,810 నుంచి ప్రారంభమవుతాయి. భారత్ గౌరవ డీలక్స్ ఏసి రైలు ఈ ప్యాకేజీ లో రన్ కానుంది. సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజ్ టూర్ ఎలా ఉంటుందంటే..

సెప్టెంబర్ 25వ తేదీన ఢిల్లీలోని శబ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ లో ప్రయాణం ప్రారంభిస్తుంది. సాయంత్రం 6 గంటలకు ఉజ్జయిని చేరుకుంటుంది. రెండో రోజు ఉజ్జయిని మహంకాళి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత మూడో రోజు ఓంకారేశ్వర ఆలయానికి చేరుకుంటారు.. నాలుగవ రోజు గుజరాత్ లోని ద్వారక రైల్వే స్టేషన్ కు చేరుకొని.. 5వ రోజు ద్వారకా దీశ్ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ రుక్మిణి దేవి ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం ఉంటుంది. ఆరవ రోజు సోమనాథ్ ఆలయం చేరుకుంటారు. ఏడవ రోజు మహారాష్ట్రలోని పూణే కు చేరుకొని గణేష్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఎనిమిదవ రోజు బీమా శంకర్ జ్యోతిర్లింగ ఆలయ దర్శనం ఉంటుంది. 9వ రోజు గృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయ దర్శనం ఉంటుంది. పదవరోజు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయ దర్శనం ఉంటుంది. 11వ రోజు తిరిగి ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు.

ప్రయాణికులు ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం, అల్పాహారం అన్ని రైలులోనే అందిస్తారు. కేవలం ఆలయాల సందర్శనమే కాకుండా కొన్ని ప్రదేశాల్లోని బీచ్, ఇతర ప్రదేశాలను కూడా చూపిస్తారు. అంతేకాకుండా యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కూడా అందిస్తారు. అయితే పర్యాటక ప్రదేశాల్లో ఏవైనా వస్తువులు కొనుగోలు చేసిన.. లేదా ఇతర అవసరాలకు మాత్రం ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు రైల్వే శాఖ వెబ్సైట్ ను సందర్శించాలని అధికారులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper