Bolisetti Satyanarayana : ఈ మధ్య సాక్షి మీడియా బొలిశెట్టి సత్యనారాయణకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. సాక్షి టీవీలో.. సాక్షి పేపర్లో ఆయనకు అంచనాలకు మించిన కవరేజీ ఇస్తోంది. ఇలా ఎందుకు చేస్తోంది అని ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కూటమి ప్రభుత్వం విశాఖపట్నం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చే ప్రయత్నాలను వేగవంతం చేసింది. విలువైన వనరులు మొత్తం ఉండడంతో విశాఖపట్నం నగరాన్ని సమూలంగా మార్చడానికి కూటమినేతలు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా డాటా సెంటర్లు.. ఐటీ కంపెనీలు.. ఫార్మా కంపెనీలు.. లాజిస్టిక్స్.. తయారీ కేంద్రాలు.. ఇంకా అనేక రకాల కర్మా గారాలను ఏర్పాటు చేయడానికి కూటమినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలను ఒప్పించి విశాఖపట్నం నగరంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు.
వినాశనం లేకుండా వికాసం సాధ్యం కాదు. ప్రస్తుతం మనిషి అనిభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక ప్రకృతి విధ్వంసం దాగి ఉంది. వికాసం కోసం ప్రకృతి మొత్తాన్ని నాశనం చేయకూడదు. ఇదే పాలసీలో కూటమినేతలు విశాఖపట్నం నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు తలా తోకా లేకుండా ఎండగడుతున్నారు. అభివృద్ధి అనేది తప్పు అనే కోణంలో మాట్లాడుతున్నారు. చివరికి google డాటా సెంటర్ విషయంలో కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
వైసీపీ నేతల మాటలకు విలువ లేకపోవడంతో జనసేన పార్టీ మీద ఫోకస్ పెట్టారు. ఆ పార్టీలో మాజీ నేతగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ను తెర ముందుకు తీసుకొచ్చారు. ఆయన ద్వారా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం నాశనం అయిపోతుందని.. గూగుల్ డేటా సెంటర్ల వల్ల కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురి, సింహాచలం కొండల ప్రాంతంలో పర్యావరణం విధ్వంసం అవుతుందని సత్యనారాయణ ద్వారా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సత్యనారాయణ గతంలో జనసేనలో కీలక నాయకుడిగా పని చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తో విభేదాల వల్ల బయటికి వచ్చారు. కంబాలకొండకు పది కిలోమీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. పర్యావరణ చట్టాలను కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు అడవి అంటే చాలా ఇష్టం. అందులో జంతువులు అంటే మరింత ఇష్టం. అందువల్లే ఆయన వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఇటీవల అటవీ శాఖ అధికారులతో ఉచ్చులను తొలగించారు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం ఆ పని చేశారు. మడ అడవుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఎర్రచందనం కలప పరిరక్షణ కోసం ఏకంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. శేషచలం కొండల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు చేశారు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి పర్యావరణానికి నష్టం మీద కలిగిస్తారు.. ఈ మాట చెబితే జనాలు నమ్మరు కాబట్టి.. జనసేనలో పనిచేసిన మాజీ నేతతో వైసిపి ఈ పని చేస్తుంది. కానీ జనాలకు అంతా తెలుసు.