Gujarat Well Water : చింత చెట్టుకు వేపకాయలు కాస్తాయి. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. నంది పరుగులు తీస్తుంది. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి. ఇదంతా చదువుతుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వాక్యాలు గుర్తు వస్తున్నాయి కదా.
ఇది నిజమో.. అబద్ధమో తెలియదు గాని.. ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందేమో అనిపిస్తుంది. వాస్తవానికి వ్యవసాయ బావిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా అది నిచ్చలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అందులో కదలికలు ఉండవు. ఎందుకంటే బావి అనేది ఒక పరిమిత స్థాయిలో ఉండ నిర్మాణం. అందులో నీరు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లే సాధ్యమైనంతవరకు రైతులు పంటలకు సమృద్ధిగా నీరు అందాలంటే బావిని లోతుగా తవ్వుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే భూగర్భ జలాలు అధికంగా ఉంటాయి. అలాంటి చోట రైతులు స్వల్ప లోతులోనే బావులను తవ్వుతూ ఉంటారు.
గుజరాత్ రాష్ట్రంలో మాత్రం భూగర్భ జలాలు అధికంగా ఉంటాయి.. ముఖ్యంగా అక్కడ మోర్బి జిల్లాలో భూగర్భ జలాల మట్టం అధికంగా ఉంటుంది. ఈ జిల్లాలోని వీర్పర్ధ అనే గ్రామంలో సరిగా మూడు నెలల క్రితం ఒక రైతు బావి తవ్వాడు. చుట్టూ సిమెంట్ ఓడలు కూడా పోశాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఆ రైతు తవ్విన బావిలో నీరు సమృద్ధిగా చేరింది. ఇటీవల కాలంలో అక్కడ వర్షాలు విపరీతంగా కురిశాయి. అందువల్లే బావిలో నీరు సమృద్ధిగా చేరింది. గడిచిన ఆదివారం ఆ బావిలో ఉన్న నీరు ఒకసారిగా మసకబారింది. సముద్రపు అలల మాదిరిగా ఊగడం ప్రారంభమైంది.. గడిచిన 8 నుంచి పది రోజుల్లో ఈ జిల్లాలో ఎటువంటి భూకంపం నమోదు కాలేదు. భూమిలో ప్రకంపనలు కూడా చోటు చేసుకోలేదు. అయితే ఇలా నీరు సముద్రపు అలల మాదిరిగా పోవడానికి ప్రధాన కారణం భూగర్భ శిలల మధ్య చిక్కుకున్న వాయువు మీద వర్షపు నీటి ఒత్తిడి పెరగడమే. దీనిని ఆ జిల్లాలోని భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించడానికి ఈ జిల్లాలోని భూగర్భ జిల్లా పరిశోధన సంస్థ నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించడానికి సిద్ధమయ్యారు.
మనదేశంలో విపత్తులు చోటు చేసుకునే రాష్ట్రాలలో గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలోని గతంలో కచ్ ప్రాంతంలో అతిపెద్ద భూకంపం చోటుచేసుకుంది. నాడు భారీగానే ప్రాణ నష్టం సంభవించింది. అయితే ఇప్పుడు ఈ బావిలో ఉన్న నీరు ఒక్కసారిగా పైకి రావడం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. పైగా ఆ నీరు ఊగిపోతోంది. దీంతో అక్కడి ప్రజల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఈ వార్త బయటి ప్రపంచానికి తెలియడంతో చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం అవుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Well Water Continues to Oscillate in Morbi Village; Collector Orders Probehttps://t.co/pff81MqDLb pic.twitter.com/YmeMLJAMfO
— DeshGujarat (@DeshGujarat) August 6, 2026