Prabhas Rejected Movies : ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు ప్రభాస్…కెరియర్ స్టార్టింగ్ లో ఒకటి రెండు సినిమాలతో ప్లాప్ లను మూటగట్టుకున్నాడు. ‘వర్షం’ సినిమాతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత వెను తిరిగి చూడలేదు. వరుసగా చత్రపతి, డార్లింగ్, బుజ్జిగాడు, బిల్లా లాంటి సక్సెస్ లతో తనను తాను స్టార్ హీరోగా మార్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మిస్ చేసుకున్న రెండు సినిమాలు ఇద్దరు నటులను స్టార్లుగా మార్చిందనే విషయం మనలో చాలామందికి తెలియదు…ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? స్టార్ హీరోలుగా మారిన ఆ నటులు ఎవరు అంటే అందులో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ కాగా, మరొకరు అల్లు అర్జున్ కావడం విశేషం…ఎన్టీఆర్ హీరోగా చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కథ మొదట ప్రభాస్ వద్దకే వచ్చింది. రాజమౌళి సైతం ప్రభాస్ తో చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాడు.
కానీ ప్రభాస్ కి ఆ కథ నచ్చకపోవడంతో దానిని రిజెక్ట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆ మూవీ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు… ఇక సుకుమార్ డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఆర్య సినిమా కథను సైతం మొదట ప్రభాస్ కి వినిపించారట. హీరోగా అయినప్పటికి ప్రభాస్ కి ఆ కథ పర్ఫెక్ట్ గా సెట్ కాదని అనుకున్నాడట.
దాంతో ఆ మూవీని రిజెక్ట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాను చేసి స్టార్ హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ సూపర్ హిట్స్ ను సాధిస్తూ టాప్ హీరోగా ఎదిగాడు. నిజానికి ప్రభాస్ కనక ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఆయన అప్పట్లోనే టాప్ లోకి వెళ్ళేవాడు. కానీ ఆయన ఆ సినిమాలను చేయలేదు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయన వదిలేసుకున్న రెండు సినిమాలు అల్లు అర్జున్ కి చాలా వరకు హెల్ప్ అయ్యాయి. వాళ్ళను టాప్ హీరోలుగా నిలబెట్టిన సినిమాలు ఇవే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…