Homeఎంటర్టైన్మెంట్Omkoochi Narasimhan Son: స్టార్ కమెడియన్ కొడుకు నేడు స్వామిజీ అయ్యాడు.. ఆ స్వామిజీ ఎవరో...

Omkoochi Narasimhan Son: స్టార్ కమెడియన్ కొడుకు నేడు స్వామిజీ అయ్యాడు.. ఆ స్వామిజీ ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Omkoochi Narasimhan Son: నేటి తరం ఆడియన్స్ కి పెద్దగా పేరు పరిచయం లేని కమెడియన్స్ మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాలను చూస్తే చాలా తేలికగా గుర్తుపట్టగలరు. వాళ్ళ కామెడీ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు ఓంకూచి నరసింహన్. బక్కపలచటి శరీరం , కీచు గొంతు తో కామెడీ చేసే ఈ కమెడియన్ , మన టాలీవుడ్ లో 1500 కి పైగా […]

Omkoochi Narasimhan Son: నేటి తరం ఆడియన్స్ కి పెద్దగా పేరు పరిచయం లేని కమెడియన్స్ మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ముఖాలను చూస్తే చాలా తేలికగా గుర్తుపట్టగలరు. వాళ్ళ కామెడీ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి కమెడియన్స్ లో ఒకరు ఓంకూచి నరసింహన్. బక్కపలచటి శరీరం , కీచు గొంతు తో కామెడీ చేసే ఈ కమెడియన్ , మన టాలీవుడ్ లో 1500 కి పైగా సినిమాల్లో నటించాడంటే నమ్ముతారా?, కానీ ఆయన నిజంగానే అన్ని సినిమాల్లో నటించాడు. 1936 వ సంవత్సరం లో తమిళనాడు లోని కుంభకోణం నగరం లో జన్మించారు నరసింహన్. తనకు 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ‘అబ్బయ్య’ అనే చారిత్రాత్మక చిత్రం లో బాలనటుడిగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఈ సినిమా తర్వాత బాలనటుడిగా ఆయనకు ఎన్నో అవకాశాలు క్యూలు కట్టాయి.

కానీ ఆయన మాత్రం చదువుకే ప్రాధాన్యత ఇచ్చాడు. డిగ్రీ పూర్తి చేసి LIC కంపెనీ లో ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా నిలిచాడు. ఎన్నో ఏళ్ళు LIC కంపెనీ లోనే పని చేస్తూ వచ్చిన నరసింహన్, సరస్వతి అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ నలుగురు పిల్లలు పుట్టారు. వారిలో ముగ్గురు కూతుర్లు. వారి పేర్లు విజయలక్ష్మి , నిర్మల , సంగీత. ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఓంకారేశ్వర. బాలనటుడిగా నటించిన తర్వాత 30 ఏళ్ళు సుదీర్ఘ విరామం తీసుకొని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నరసింహన్, తమిళ లెజండరీ నటుడు సురులై రాజన్ , దర్శకుడు విసు వంటి వారి ప్రోత్సాహం తో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అనతికాలం లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నాడు. తక్కువ సమయం లోనే రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించే అవకాశం నరసింహన్ కి దక్కింది.

ఇక మన టాలీవుడ్ కి ఈయన విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ ‘పవిత్రబంధం’ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘మా పల్లె గోపాలుడు’ తో పాటు పలు సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించాడు. ఇంతటి సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న నరసింహన్ కొడుకు ఓంకారేశ్వర ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో తెలుసా?. ఇతని వయస్సు 45 ఏళ్లకు పైగానే ఉంటుంది. లెజండరీ కమెడియన్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆయన లేజసీ ని కొనసాగిస్తాడని అందరూ అనుకుంటే, ఇతను మాత్రం సన్యాసిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నారు. తనకు దేవుళ్ళు నిత్యం కనిపిస్తూనే ఉంటారని, సాయి బాబా, జీసస్ వంటి దేవుళ్లతో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తుంటాడు ఈయన. భక్తులకు దైవత్వం గురించి ప్రవచనాలు ఇవ్వడం లో ఓంకారేశ్వర నిష్ణాతుడు అనే చెప్పాలి. ఈయనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by Maraz TV (@maraz.tv)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper