Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాటంటే మాట. ఏదైనా హామీ ఇస్తే తప్పకుండా తీర్చుతారు. ఇప్పుడు ఏకంగా ఇచ్చిన మాట ప్రకారం ఉప్పాడ తీరానికి రక్షణ గోడ నిర్మించనున్నారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం నడుము బిగించింది. రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, డి పి ఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాస్ కు అప్పగిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీరప్రాంతరక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.
* గత కొంతకాలంగా కోత..
ఉప్పాడ తీర ప్రాంతం గత కొంతకాలంగా కోతకు గురవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతూ వచ్చారు. ఈ కెరటాల ధాటికి సుబ్బంపేట నుంచి ఉప్పాడ మీదుగా కోనాపాప పేట వరకు మత్స్యకార గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వందల సంఖ్యలో ఇళ్లు, ఆలయాలు, ఆస్తులు సముద్రంలో కలిసిపోయాయి. ఉప్పాడ- కొత్తపల్లి రోడ్డు సైతం కోతకు గురవుతోంది. వీటి రక్షణ కోసం గతంలో నిర్మించిన జియో ట్యూబ్ సైతం చల్లా చెదురయ్యింది. వైసిపి ప్రభుత్వ హయాంలో హడావిడి నడిచింది కానీ నిర్మాణం జరగలేదు. అయితే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడం.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడం.. ఆయన దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో నిపుణులతో మాట్లాడి.. రక్షణ గోడ నిర్మాణానికి రూ.323 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. 15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించి మత్స్యకార గ్రామాలకు ముప్పు భారీ నుంచి తప్పించనున్నారు.
* నవంబర్ నుంచి పనులు..
అయితే నవంబర్ నుంచి రక్షణ గోడ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కెరటాల ధాటికి కోతకు గురవుతున్న గ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. దేశవ్యాప్తంగా తీరప్రాంతాల్లో కోత నివారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే ఉప్పాడ తీరంలో ఈ కోతల ప్రభావం అధికంగా ఉంది. చాలా ఎక్కువగా నష్టం జరుగుతోంది. అందుకే పవన్ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. నిధుల విడుదలై పనులు త్వరితగతిన ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు డీ పీ ఆర్ తయారు చేసే బాధ్యతను మద్రాస్ ఐఐటీకి అప్పగించారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూపకల్పన పూర్తి కానుంది. ఇది జరిగిన వెంటనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించి నవంబర్లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే తీరానికి రక్షణగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలుస్తుండడం మాత్రం నిజంగా శుభపరిణామం.
View this post on Instagram