Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Health: భరించలేని నొప్పి.. పవన్ బాధ పగవాడికి కూడా రాకూడదు!

Pawan Kalyan Health: భరించలేని నొప్పి.. పవన్ బాధ పగవాడికి కూడా రాకూడదు!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మొన్న మధ్యన ఆయన ముంబైలో ఆపరేషన్ కూడా చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మొన్నటి వరకు చేతికట్టుతో కనిపించిన పవన్.. నిన్న విశాఖలో మాత్రం ఎటువంటి కట్టు లేకుండా కనిపించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చారు. అటవీ శాఖ మంత్రిగా ఉండడం.. జంతు […]

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మొన్న మధ్యన ఆయన ముంబైలో ఆపరేషన్ కూడా చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మొన్నటి వరకు చేతికట్టుతో కనిపించిన పవన్.. నిన్న విశాఖలో మాత్రం ఎటువంటి కట్టు లేకుండా కనిపించారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చారు. అటవీ శాఖ మంత్రిగా ఉండడం.. జంతు ప్రేమికుడు కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఒకవైపు అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం పవన్ కళ్యాణ్కు ఉంది. మొన్న మధ్యన అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు చూస్తున్న మంత్రి నారాయణ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం కార్యక్రమాలు ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభం కావడంతో.. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి తాను హాజరు కాలేనని చెప్పారు పవన్.

* ఏనుగుల దినోత్సవం లో..
ఏనుగుల దినోత్సవం లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం లభించింది. కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. అయితే కట్టుకోలేకుండా ఉండడంతో ఆయన ఆరోగ్యం కుదుట పడినట్లు అంతా భావించారు. కానీ కార్యక్రమం జరిగినంత సేపు భరించలేని నొప్పితో బాధపడుతూ కనిపించారు పవన్. ఏ చేతికి ఆపరేషన్ జరిగిందో ఆ చేతిని మరో చేతితో పట్టుకొని కార్యక్రమం జరిగినంత సేపు కొంచెం ఇబ్బంది పడ్డారు పవన్ కళ్యాణ్. అయినా సరే తన బాధను ఎక్కడ బయటకు వ్యక్తం చేయకుండా భరించారు. ఏనుగుల దినోత్సవం కార్యక్రమం ముగిసిన అంతవరకు ఓపికగా ఉన్నారు. వాటికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* పవర్ ఫుల్ స్పీచ్..
పవన్ కళ్యాణ్ ఇదే కార్యక్రమంలో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అడవుల సంరక్షణతో పాటు జీవవైవిద్యానికి ఏనుగులు కాపలాదారులుగా అభివర్ణించారు. దేశ వారసత్వానికి ప్రతికలు అని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో 132 నుంచి 142 వరకు ఏనుగులు ఉన్నట్లు తెలిపారు. ఏనుగులు వల్ల మనుషుల ప్రాణాలకు హాని కలుగుతున్న దృష్ట్యా.. కూటమి వచ్చిన తర్వాత కుంకి ఏనుగులను తీసుకొచ్చి సంరక్షించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హనుమాన్ కార్యక్రమంలో భాగంగా రాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, ఏడు వన్యప్రాణుల అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 200 వరకు వన్యప్రాణులను రక్షించినట్లు చెప్పారు. 30కి పైగా ప్రత్యేక ఆపరేషన్లు చేసినట్లు చెప్పుకొచ్చారు. దాదాపు రెండు గంటలపాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ భరించలేని నొప్పితో గడపాల్సి వచ్చింది. అయినా సరే ఆ బాధను బయటకు వ్యక్తం చేయించలేదు.

 

View this post on Instagram

 

A post shared by Mega9tv Telugu (@mega9tv_telugu)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper