Comedian Padmanabham Son Details: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నంత కమెడియన్స్ ఇండియా లోనే కాదు, ప్రపంచం లో కూడా ఎక్కడా ఉండరు అనేది వాస్తవం అని విశ్లేషకులు సైతం అంటూ ఉంటారు. ప్రస్తుతానికి మన ఇండస్ట్రీ లో కమెడియన్స్ అవసరం అంతగా లేకపోవచ్చు, కానీ ఒక కమెడియన్ ఎలాంటి పాత్ర ని అయినా చెయ్యగలడు అని ఎంతో మంది నిరూపించుకున్నారు. ఇలా మన ఇండస్ట్రీ లో ఇంతమంది కమెడియన్స్ పుట్టి పెరగడానికి కచ్చితంగా ఎవరో ఒకరిని ఆదర్శంగా నిలబడడమే అందుకు కారణం అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు. అలా నేటి కమెడియన్స్ ఈ రేంజ్ లో అలరించడానికి, వాళ్ళు అలా తయారు అవ్వడానికి ఓనమాలు దిద్దించిన వారు గోల్డెన్ యుగం లో ఉన్న కమెడియన్స్ పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య తదితరులు. వీళ్ళు పండించిన కామెడీ ని చూసి నేర్చుకొనే నేడు ఇంతమంది కమెడియన్స్ తయారు అయ్యారు అనడంలో అతిశయోక్తి లేదేమో.
Also Read: ‘పుష్ప 2’ వల్ల ఫహాద్ ఫాజిల్ ఇంత కోల్పోయాడా? సంచలనం రేపుతున్న కామెంట్స్!
ఈ లెజండరీ కమెడియన్స్ లో మనం పద్మనాభం(Padmanabham) గురించి నేడు మాట్లాడుకోబోతున్నాం. చిన్నతనం నుండి నాటకాల మీద ప్రత్యేకమైన మక్కువ ఉన్న పద్మనాభం గారు, ఒక బాలనటుడిగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆయన పెరిగి పెద్దయ్యాక 1950 వ సంవత్సరం నుండి తన నిజమైన సినీ కెరీర్ ఆరంభమైంది. ఆయన మొట్టమొదటి చిత్రం ‘షావుకారు’. ఇందులో ఆయన చిన్న క్యారక్టర్ చేసాడు, సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’,’గుండమ్మ కథ’, ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ క్లాసిక్ చిత్రాల్లో కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి కోట్లాది మంది సినీ అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పద్మనాభం గారు కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు, హీరో గా కూడా పలు చిత్రాల్లో నటించి కమర్షియల్ సక్సెస్ లను అందుకున్నాడు.
Also Read: మహావతార్ నరసింహ సినిమా అల్లు అరవింద్ కి వరంలా మారిందా..?
నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించాడు కానీ, అవి పెద్ద ఫ్లాప్స్ గా నిలవడంతో పద్మనాభం కొంత కాలం ఆర్థికంగా బాగా ఇబ్బందులకు కూడా గురి కావాల్సి వచ్చింది. ఆయన తన చివరి రోజుల్లో కనిపించిన చిత్రాలు ‘భద్ర’, ‘చక్రం’. ఇదంతా పక్కన పెడితే పద్మనాభం కొడుకు కూడా ఇండస్ట్రీ లో ఒక కమెడియన్ గా కొనసాగుతున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. పద్మనాభం తమ్ముడి కొడుకు తిరుపతి ప్రకాష్ ఎన్నో ఏళ్ళ నుండి కమెడియన్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తనకు పద్మనాభం గారు పెద్ద తండ్రి అవుతాడు అనే విషయాన్నీ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఈయన జబర్దస్త్ లో కూడా పలు స్కిట్స్ వేసాడు. పేరు వింటే వెంటనే గుర్తు పట్టలేకపోవచ్చు కానీ, ముఖాన్ని చూస్తే మాత్రం ప్రతీ ఒక్కరు గుర్తుపట్టేస్తారు. ఆయన ఫోటోని క్రింద అందిస్తున్నాము చూడండి.