Homeఎంటర్టైన్మెంట్Hyper Aadi : ఆ స్టార్ హీరోయిన్ తో హైపర్ ఆదికి ఉన్న రిలేషన్ ఇదేనా..?...

Hyper Aadi : ఆ స్టార్ హీరోయిన్ తో హైపర్ ఆదికి ఉన్న రిలేషన్ ఇదేనా..? సంచలనం రేపుతున్న ఆసక్తికరమైన నిజాలు..

Hyper Aadi : ‘జబర్దస్త్ ‘ ద్వారా పాపులారిటీ ని సంపాదించి , ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి బాగా సక్సెస్ ని చూసిన వారిలో ఒకరు హైపర్ ఆది. ఒక పక్క టీవీ షోస్ లో కొనసాగుతూనే , మరోపక్క సినిమాలను బ్యాలన్స్ చేస్తూ కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు హైపర్ ఆది. రీసెంట్ గా ఆయన కమెడియన్ గా చేసిన చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’ ఈ నెల 14 న […]

Hyper Aadi : ‘జబర్దస్త్ ‘ ద్వారా పాపులారిటీ ని సంపాదించి , ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి బాగా సక్సెస్ ని చూసిన వారిలో ఒకరు హైపర్ ఆది. ఒక పక్క టీవీ షోస్ లో కొనసాగుతూనే , మరోపక్క సినిమాలను బ్యాలన్స్ చేస్తూ కెరీర్ లో పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు హైపర్ ఆది. రీసెంట్ గా ఆయన కమెడియన్ గా చేసిన చిత్రం ‘విశ్వనాధ్ & సన్స్’ ఈ నెల 14 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం , మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసిన ఈ స్పీచ్ కి సంబంధించిన వీడియో నే కనిపిస్తోంది.

‘జబర్దస్త్’ లోకి తీసుకొచ్చి , నా కెరీర్ ని అదిరే అభి అన్న ఎలా మార్చాడో , సినిమాల్లో నా కెరీర్ ని డైరెక్టర్ వెంకీ అట్లూరి అలాగే మార్చలేదు. ఆయన ప్రతీ సినిమాలోనూ నేను భాగం అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆది మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇదే ఈవెంట్ లో హీరోయిన్ మమిత బైజు ప్రత్యేకించి హైపర్ ఆది గురించి మాట్లాడడం ఇప్పుడు హైలైట్ గా మారింది. సెట్స్ లో మన ఇద్దరం చేసిన ఫన్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆమె ఆది ని ఉద్దేశించి మాట్లాడింది. సాధారణంగా హీరోయిన్లు సినిమాల్లో చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ గురించి ప్రత్యేకించి మాట్లాడడం తక్కువ. అలాంటిది మమిత హైపర్ ఆది గురించి మాట్లాడిందంటే , ఆమె ఈయనకు చాలా మంచి స్నేహితురాలు అయిపోయిందని అంటున్నారు నెటిజెన్స్.

వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉందని , భవిష్యత్తులో మమిత చేసే ప్రతీ తెలుగు సినిమాలో హైపర్ ఆది ఉండొచ్చని అంటున్నారు. ఇకపోతే హైపర్ ఆది ప్రస్తుతం ఈటీవీ లో ప్రత్యేకంగా ఎలాంటి షో లోనూ కనిపించడం లేదు. అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కనిపిస్తూ ఉంటాడు కానీ , ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన షో ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. డీ డ్యాన్స్ షో వరుస సీజన్స్ లో పాల్గొంటూ వచ్చిన హైపర్ ఆది , ఇప్పుడు ఆ షో కి బ్రేక్ పడడంతో కొంత కాలం ఆయన టీవీ షోస్ కంటే ఎక్కువగా సినిమాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper