Homeఎంటర్టైన్మెంట్Yadam Raju: బుల్లితెర కమెడియన్ యాదమరాజు సామాన్యుడు కాదు.. ఇతను బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చూస్తే...

Yadam Raju: బుల్లితెర కమెడియన్ యాదమరాజు సామాన్యుడు కాదు.. ఇతను బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ చూస్తే ఆశ్చర్యపోతారు..

Yadam Raju: ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు ఏ స్థానం లో కొనసాగుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా జబర్దస్త్ ద్వారా అశేష ప్రజాభిమానం సంపాదించుకున్న వారిలో ఒకరు యాదమ్మ రాజు. ప్రస్తుతం ఈయన లేని ఎంటర్టైన్మెంట్ షో మరొకటి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ‘మాస్ జాతర’ అనే కామెడీ షో లో పాల్గొంటున్న యాదమ్మరాజు, ఈటీవీ లో […]

Yadam Raju: ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేడు ఏ స్థానం లో కొనసాగుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా జబర్దస్త్ ద్వారా అశేష ప్రజాభిమానం సంపాదించుకున్న వారిలో ఒకరు యాదమ్మ రాజు. ప్రస్తుతం ఈయన లేని ఎంటర్టైన్మెంట్ షో మరొకటి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. జెమినీ టీవీ లో ప్రసారమయ్యే ‘మాస్ జాతర’ అనే కామెడీ షో లో పాల్గొంటున్న యాదమ్మరాజు, ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ తో పాటు , స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా కమెడియన్ గా కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు జీ తెలుగు కామెడీ షోస్ లో కూడా ఈయన కనిపిస్తూ ఉంటాడు.

అయితే ఇంతకీ ఎవరు ఈ యాదమ్మరాజు ?, జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఇతను ఏమి చేసేవాడు?, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈయన నల్గొండ జిల్లాలోని రంగారెడ్డి గూడెం లో జన్మించాడు. ఇతని అసలు పేరు రాజు. మరి అందరూ ఎందుకు ‘యాదమ్మ’ అని పిలుస్తుంటారు ?, అది ఆయన ఇంటి పేరా అని మీరు అనుకోవచ్చు. కానీ కాదు , జబర్దస్త్ లో రాజు వేసిన ఒక స్కిట్ లో ‘యాదమ్మ’ అనే క్యారెక్టర్ చేసాడు. ఆ క్యారెక్టర్ వేరే లెవెల్ లో పెయింది. అప్పటి నుండి ‘యాదమ్మ రాజు’ గా ఆయన పేరు స్థిరపడిపోయింది. ‘జబర్దస్త్’ లోకి వచ్చే ముందు యాదమ్మ రాజు ఈటీవీ లో ప్రసారమయ్యే ‘పటాస్’ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ‘జబర్దస్త్’ , ‘అదిరింది’ వంటి షోస్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా ఇతనికి ఉన్నటువంటి మర్చిపోయే సహజగుణం తో పండించే కామెడీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక ఈయన వ్యక్తిగత విషయాలకు వస్తే డిసెంబర్ 2022 వ సంవత్సరం లో స్టెల్లా రాజ్ ని వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరు కలిసి గతం లో నీతోనే డ్యాన్స్ అనే డ్యాన్స్ షో లో కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియా లో స్టెల్లా బాగా పాపులర్. అప్పుడప్పుడు టీవీ షోస్ లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే వీళ్లిద్దరికీ జెనీసా రాజ్ అనే పాప కూడా ఉంది. ఈ పాపకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ వైరల్ గానే చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే యాదమ్మ రాజు ని బిగ్ బాస్ షో లో చూడాలని చాలా రోజుల నుండి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ‘బిగ్ బాస్ 10’ లో ఆయన పాల్గొంటాడా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper