Homeఎంటర్టైన్మెంట్Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన...

Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా!

Jabardasth Ram Prasad : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు ఆటో రామ్ ప్రసాద్. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లతో కలిసి ఈయన చేసే కామెడీ ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసేది. ఒక విధంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను నేడు ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం రామ్ ప్రసాద్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతీ […]

Jabardasth Ram Prasad : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన కమెడియన్స్ లో ఒకరు ఆటో రామ్ ప్రసాద్. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లతో కలిసి ఈయన చేసే కామెడీ ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసేది. ఒక విధంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను నేడు ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం రామ్ ప్రసాద్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతీ స్కిట్ ఆయనే రాసేవాడు కాబట్టి. అయితే ఆ రేంజ్ లో కామెడీ ని పంచె రామ్ ప్రసాద్ కి ఎందుకు సినిమాల్లో ఆశించిన స్థాయి అవకాశాలు రావడం లేదు?, అంత పెద్ద కమెడియన్ ‘బిగ్ బాస్ 10’ లోకి రావాల్సిన అవసరం ఏంటి? అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో చాలా రోజుల నుండి కామెంట్స్ చేస్తున్నారు.

అయితే రామ్ ప్రసాద్ కి సినిమాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి ఒక స్టార్ హీరో కారణమని, ఒక షూటింగ్ సెట్స్ లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన గొడవ, రామ్ ప్రసాద్ కెరీర్ కి శాపం లాగా మారిందని, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తో ఆ హీరో కి మంచి సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల, ఆటో రామ్ ప్రసాద్ కి అవకాశాలు రాకుండా చేసారని ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉంది. కానీ రామ్ ప్రసాద్ మంచి స్కిట్ రైటర్ అయ్యుండొచ్చు కానీ, గొప్ప కమెడియన్ కాదని, అందుకే ఆయనకీ అవకాశాలు రాలేదని మరికొందరు అంటున్నారు.

ఉదాహరణకి బిగ్ బాస్ 10 ని తీసుకోవచ్చని, రామ్ ప్రసాద్ బిగ్ బాస్ 10 కి రాబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు ఆడియన్స్ చాలా సంతోషించారని, ఇక ఎంటర్టైన్మెంట్ కి తిరుగు ఉండదని అంతా బావించారని, కానీ రామ్ ప్రసాద్ ఆశించిన స్థాయిలో కామెడీ చేయడం లేదని, ఆయనకంటే నరేష్ కామెడీ టైమింగ్ బాగుందని మరికొంతమంది విశ్లేషకులు అంటున్నారు. బిగ్ బాస్ 10 లో రామ్ ప్రసాద్ టాస్కులు పర్వాలేదు అనే రేంజ్ లో ఆడుతున్నాడు కానీ, గత సీజన్ లో ఇమ్మానుయేల్ పెర్ఫార్మన్స్ తో పోలిస్తే రామ్ ప్రసాద్ చాలా తక్కువని అంటున్నారు. రాబోయే రోజుల్లో అయిన రామ్ ప్రసాద్ తన ఆట తీరుతో ప్రేక్షకుల మెప్పు ని పొందుతాడో లేదో చూడాలి.

ఒకవేళ రామ్ ప్రసాద్ రాబోయే రోజుల్లో తన మార్క్ గేమ్ ని ఆడుతూ ముందుకు వెళ్తే మాత్రం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే ఆయనకీ భారీ రేంజ్ లో అవకాశాలు రావొచ్చు. అయితే గేమ్ ఇప్పుడు చాలా కఠినమైంది. బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితులు మొత్తం రోహిత్, త్రిగున్, ముకేశ్ మధ్యలోనే తిరుగుతున్నాయి. ఈ కారణం చేత రామ్ ప్రసాద్ స్క్రీన్ స్పేస్ ప్రతీ వారం తగ్గుతోంది. ఇలాగే కొనసాగితే ఆయన టాప్ 5 లో ఉండడం కూడా కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది. మరి రామ్ ప్రసాద్ గేమ్ మీకు ఎలా అనిపిస్తోంది?, టాప్ 5 వరకు వెళ్తాడని అనుకుంటున్నారా?, బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కెరీర్ ఫుల్ బిజీ అవుతుందా?, లేదా ఎప్పటి లాగానే జబర్దస్త్ కి పరిమితం అవుతాడా?, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper