Airtel Scam: మనదేశంలో అతిపెద్ద టెలికాం నెట్వర్క్ సంస్థగా ఎయిర్ టెల్ కు పేరుంది. సర్విస్ విషయంలో.. సిగ్నల్ విషయంలో ఈ కంపెనీ కాంప్రమైజ్ కాదు. కాకపోతే సర్వీస్ కు తగ్గట్టుగానే చార్జీలు కూడా ఉంటాయి. జియో వచ్చిన తర్వాత ఎయిర్ టెల్ చాలావరకు తగ్గింది. చార్జీల విషయంలో.. ఇతర సదుపాయాలు కల్పించే విషయంలో కస్టమర్ ఫ్రెండ్లీగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
ఎయిర్ టెల్ నెట్వర్క్ సినిమా వాడకం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురైందో ఓ కస్టమర్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వీడియో రూపంలో పంచుకున్నాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం..” ఎయిర్ టెల్ కి పోర్ట్ పెట్టుకుంటే.. వాళ్లు ప్రీపెయిడ్ లేదు అని చెప్పారు. ఓన్లీ పోస్ట్ పెయిడ్ అని మాత్రమే అని అంటగట్టారు. కానీ నేను కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్లు సింపుల్గా పోస్ట్ పెయిడ్ క్యాన్సిల్ చేసి Airtel thanks app డౌన్లోడ్ చేసుకొని.. అందులో ప్రీపెయిడ్ సిమ్ కోసం అప్లై చేస్తే.. ఇంటికె సిమ్ కార్డు పంపిస్తామన్నారు. అసలు విషయం ఏమంటే..ఎయిర్ టెల్ స్టోర్స్ లో పోస్ట్ ఎంప్లాయిస్ కి పోస్ట్ పెయిడ్ సిమ్ టార్గెట్స్ ఇస్తారట. అవి రిచ్ అవడం కోసం మనకు ఆ సిమ్ కార్డులు అవసరం లేకపోయినా అంటగడుతున్నారు. ఇదొక టైప్ స్కాం” అని ఆ వ్యక్తి వాపోయాడు.
నిజానికి నేటి కాలంలో చాలామంది ప్రీపెయిడ్ మాత్రమే వాడుతున్నారు. ఒకప్పటి మాదిరిగా కాల్ చార్జీలు లేవు. డేటా సేవలు కూడా చాలావరకు అందుబాటులోకి వచ్చాయి. వైఫై చాలా మంది వాడుతున్నారు. ఎక్కువగా వాట్సాప్ సందేశాలు.. వాట్సప్ కాల్స్ ఉపయోగిస్తున్నారు. ఇలాంటప్పుడు పోస్ట్ పెయిడ్ సిమ్లను ఎవరూ అంతగా ఉపయోగించడం లేదు. గతంలో పోస్ట్ పెయిడ్ సిమ్ లు కంపెనీలు ఆఫర్ చేసేవి. అప్పట్లో పోస్ట్ పెయిడ్ సిమ్ లను వాడటం చాలా మంది ఒక హోదా లాగా భావించేవారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాల్ చార్జీలు తగ్గిపోయాయి. నెట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. డాటా కు చెల్లించాల్సిన మొత్తం కూడా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో అందరు కూడా ప్రీపెయిడ్ లోకి వచ్చేసారు.
ప్రీపెయిడ్ లోకి వస్తే టెలికాం కంపెనీలకు పెద్దగా ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు స్టోర్లలో పని చేసే ఉద్యోగులకు కంపెనీలు టార్గెట్లు విధిస్తున్నాయి. టార్గెట్లు రీచ్ అయిన వాళ్లకు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. అందువల్లే ఉద్యోగులు కూడా పోస్ట్ పెయిడ్ సిమ్ లు కస్టమర్లకు అంటగట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టమర్లు దేవుళ్ళతో సమానమైనప్పుడు.. కస్టమర్లు కోరుకున్నదే ఇవ్వాల్సి ఉన్నప్పుడు.. అదే ఇస్తే సరిపోతుంది కదా.. అలా కాకుండా నచ్చనిది అంటగడితే ఎలా ఉంటుంది. కంపెనీలకు ఆ మాత్రం సోయి ఉండదా.. లేక కస్టమర్లు ఏమైనా వెధవల మాదిరిగా కనిపిస్తున్నారా.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఎయిర్టెల్ కంపెనీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఎయిర్ టెల్ కి పోర్ట్ పెట్టుకుంటే వాళ్ళు ప్రీపెయిడ్ లేదు ఓన్లీ పోస్ట్ పెయిడ్ మాత్రమే అని సిమ్ అంటగట్టారు ..కానీ నేను కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వాళ్ళు సింపుల్ గా పోస్ట్ పెయిడ్ క్యాన్సిల్ చేసి AIRTEL THANKS app డౌన్ లోడ్ చేసుకుని అందులో ప్రీపెయిడ్ సిమ్ కోసం అప్లై చేస్తే ఇంటికే సిమ్ కార్డ్ పంపిస్తాం అన్నారు..అసలు విషయం ఏమంటే ఎయిర్ టెల్ స్టోర్స్ లో పోస్ట్ ఎంప్లాయిస్ కి పోస్ట్ పెయిడ్ సిమ్ టార్గెట్స్ ఇస్తారట..అవి రీచ్ అవడం కోసం మనకు ఆ సిమ్ కార్డులు అవసరం లేకపోయినా అంటగడుతున్నారు .. ఇదొక టైప్ స్కాం .. @airtelindia
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 2, 2026