Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో జరిగినన్ని అన్యాయాలు , అన్ని సీజన్స్ కలిపి కూడా జరగలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ ఏమి అనుకుంటారో అని కూడా బిగ్ బాస్ టీం కి లేదు , వాళ్లకు ఇష్టమొచ్చిన కంటెస్టెంట్స్ ని ముందుకు తోస్తున్నారు, తొక్కాలని అనుకున్న వాళ్ళని దారుణంగా తొక్కుతున్నారు. ఇది ప్రతీ వారం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రోహిత్ అనే కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టీం మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు అనే చెప్పొచ్చు. ఇంతకు మించి దిగజారి ప్రవర్తించలేము అనే తరహాలో వయవహరించే త్రిగున్ కి చిన్న పిల్లలకు విధించే శిక్షలు , కానీ అందులో పావు శాతం తప్పులు చేసే రోహిత్ కి మాత్రం సీజన్ మొత్తం టాస్కులు ఆదినివ్వకుండా చేసే శిక్షలు, ఓపెన్ గా ఒక కంటెస్టెంట్ ని ఇంత టార్గెట్ చేయడం తెలుగు బిగ్ బాస్ లోనే కాదు , ఇతర భాషలకు సంబంధించిన బిగ్ బాస్ షోస్ లో కూడా జరగలేదు.
అంతే కాదు వర్షిణి వంటి వీక్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయకుండా కాపాడుకుంటూ వస్తోంది బిగ్ బాస్ టీం. గత వారం ‘గోట్ ‘ అనే టాస్క్ ని నిర్వహించి, కంటెస్టెంట్స్ ని రెడ్ జోన్ , ఎల్లో జోన్ , గ్రీన్ జోన్ గా విభజించారు. గ్రీన్ జోన్ లో ముందుగా ఎవ్వరూ ఉండరు , ఎల్లో జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్కులు నిర్వహించి , వాళ్ళు గెలిచినా తర్వాత గ్రీన్ జోన్ లోకి వెళ్లి ‘గోట్’ గా నిలుస్తారు. ఈ టాస్క్ లో రోహిత్ లాంటి కంటెస్టెంట్ ని రెడ్ జోన్ లో పెట్టడం, వర్షిణి ని ఎల్లో జోన్ లో పెట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది.
అసలు వర్షిణి ఏమి టాస్కులు ఆడిందని ఆమెని ఎల్లో జోన్ లో పెట్టారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క టాస్క్ లో కూడా ఆమె గెలిచింది లేదు , పర్సనాలిటీ పరంగా కూడా ఆమె తనని తానూ చూపించుకుంది చాలా తక్కువ. నామినేషన్స్ సమయంలో అర్థం పర్థం లేకుండా అరవడం , అనవసరమైన యాటిట్యూడ్ చూపడం తప్ప, ఆమె చేసిందేమి లేదు , అయినప్పటికీ కూడా ఆమెని ఎల్లో జోన్ లో పెట్టడం ఏంటో అని ఆడియన్స్ అనుకుంటూ ఉంటే, నిన్నటి ఎపిసోడ్ లో ఏకంగా గ్రీన్ జోన్ లోకి పంపి ఆడియన్స్ కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది బిగ్ బాస్ టీం. ఈ వారం జరిగిన ‘బీబీ హోటల్’ టాస్క్ లో రోహిత్ తో జత కట్టడం వల్ల వర్షిణి గెలిచి ఒక స్టార్ ని సొంతం చేసుకుంది.
ఎవరి దగ్గర అయితే ఎక్కువ స్టార్స్ ఉంటాయో వాళ్ళు గ్రీన్ లెవెల్ కి చేరుకుంటారు. రామ్ ప్రసాద్ వద్ద 7 స్టార్స్ ఉండడంతో ఆయన్ని గ్రీన్ జోన్ లోకి పంపుతున్నట్టు బిగ్ బాస్ అధికారికంగా ప్రకటిస్తాడు. ఆ తర్వాతి స్థానం లో ఉన్న వర్షిణి ని కూడా గ్రీన్ జోన్ లోకి పంపుతున్నట్టు అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. అదే విధంగా రెడ్ జోన్ లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో , వాళ్ళని ఎల్లో జోన్ లోకి పంపుతాడు బిగ్ బాస్. వంశీ దగ్గర 40 వేల రూపాయిల క్యాష్ , రోహిత్ వద్ద 30 వేల క్యాష్ ఉంటుంది. దీంతో బిగ్ బాస్ వంశీ ని ఎల్లో జోన్ లోకి పంపుతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తాడు. ఇక్కడే బిగ్ బాస్ అడ్డంగా దొరికిపోయాడు. స్టార్స్ లో రెండవ స్థానంలో ఉన్న వర్షిణి ని ఎలా అయితే గ్రీన్ లోకి పంపారో, క్యాష్ పరంగా రెండవ స్థానం లో ఉన్న రోహిత్ ని ఎల్లో జోన్ లోకి అలాగే పంపించాలి కదా?, కానీ బిగ్ బాస్ ఎందుకు అలా చెయ్యలేదు?.
ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం చూస్తే , వర్షిణి ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి. ఆమె ఎక్కడ ఎలిమినేట్ అవుతుందో అనే భయం తోనే , కావాలని ఉద్దేశపూర్వకంగా గ్రీన్ జోన్ లోకి పంపి ఎలిమినేషన్ నుండి తప్పించారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. వర్షిణి ని ఇలా ఉద్దేశపూర్వకంగా గ్రీన్ జోన్ లోకి పంపడం చూస్తుంటే , ఆమె బిగ్ బాస్ టీం తో 10 వారాల కాంట్రాక్టు మీద ఒప్పందం చేసుకొని ఎంటర్ అయ్యింది అనే వాదనలు నిజమేనేమో అనిపిస్తుంది. అదే విధంగా ఈ షో ని పూర్తిగా త్రిగున్ వైపు తిప్పే ప్రయత్నం చేస్తోంది బిగ్ బాస్ టీం. అందుకే అతన్ని రోహిత్ ని రెడ్ జోన్ లో పెట్టి , టాస్కులు ఆడనివ్వకుండా చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో బలమైన టాక్ నడుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.