Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ లో బాగా మెరిసిన సామాన్యులలో ఒకరు రోహిత్. ఆడిషన్స్ సమయం లో ఇతన్ని చూసినప్పుడు బిగ్ బాస్ గేమ్ ఫార్మటు కి అసలు సరిపోడని అంతా అనుకున్నారు. బిందు మాధవి ముఖం మీద నీళ్లు చల్లినప్పుడు ఇతని రియాక్షన్ ని చూసిన జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క అభిజిత్ మాత్రమే ఇతనికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ముందుకు పంపాడు. అలాంటి అవకాశం ఇచ్చిన అభిజిత్ ని గర్వపడేలా చేస్తూ , ఇతను ఆడిన ఆట ఏదైతే ఉందో , వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక హౌస్ లోకి రోహిత్ 15 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే ఇతన్ని హౌస్ లోకి పంపబోతున్నట్టు చెప్పాడు అక్కినేని నాగార్జున. అయితే హౌస్ లోకి వెళ్లే ముందు రోహిత్ కి ఒక టాస్క్ ఇస్తాడు నాగార్జున.
బిందు మాధవి ఎలా అయితే అతని ముఖం పై నీళ్లు చల్లిందో, రోహిత్ చేతిలో కూడా ఒక గ్లాస్ నీళ్లు పెట్టి, లోపలకు వెళ్లిన తర్వాత ఒక కంటెస్టెంట్ ముఖం పై నీళ్లు చల్లమని చెప్తాడు నాగార్జున. సాధారణంగా నాగార్జున మాటలకు ఎవరూ ఎదురు చెప్పరు. కానీ రోహిత్ మాత్రం ‘ఇది ఒక మనిషిని అగౌరవపర్చినట్టు సార్. క్షమించండి, నేను ఇది చెయ్యలేను’ అని చెప్తాడు. అప్పుడు నాగార్జున ‘ఇది బిగ్ బాస్ నాకు చెప్పారు. నేను నీకు చెప్పాను. నువ్వు ఆ టాస్క్ చేస్తావా లేదా అనేది నీ ఇష్టం’ అని అంటాడు. చెయ్యలేని పనిని చెయ్యలేను అని ధైర్యం గా చెప్పి , ఆ మాట మీదనే బలంగా నిలబడిన రోహిత్ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి చాలా నచ్చింది. అయితే బిగ్ బాస్ లైవ్ లో చాలా సంఘటనలే జరిగాయి.
ముఖ్యంగా రోహిత్ , త్రిగున్ మధ్య జరిగిన హీట్ సంభాషణ ని చూస్తే, తప్పు రోహిత్ వైపు ఉందా?, త్రిగున్ వైపు ఉందా? అనేది చెప్పడం కష్టం గా మారింది. త్రిగున్ ఆలోచించిన విధానం చాలా కరెక్ట్ గా ఉంది , అదే సమయం లో రోహిత్ కూడా సరైన పాయింట్స్ పెట్టాడు. చూస్తుంటే రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి మధ్య క్లాష్ భారీ రేంజ్ లో ఉండేలా అనిపిస్తోంది. టాస్కులు కూడా వీళ్లిద్దరి మధ్య పోటాపోటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నేటి ఎపిసోడ్ లో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ ని చూపించబోతున్నారు. నామినేషన్స్ కి కావాల్సిన బోలెడన్ని పాయింట్స్ లైవ్ లో దొరికాయి. చూడాలి మరి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతాయా లేదా అనేది.