Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లో మనమంతా ఎంతో ఆసక్తి గా ఎదురు చూసేది సోమవారం రోజున టెలికాస్ట్ అయ్యే నామినేషన్స్ ప్రక్రియ కోసమే. కంటెస్టెంట్స్ మధ్య జరిగే గొడవలు, వాళ్ళు పెట్టే నామినేషన్స్ పాయింట్స్ ఆధారంగానే వాళ్ళ భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉంటుంది. నామినేషన్స్ ప్రక్రియ ద్వారా హైలైట్ అయిన కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు గత సీజన్ ని తీసుకుంటే, తనూజ , సుమన్ శెట్టి వంటి వారు నామినేషన్స్ ద్వారానే మంచి ఫాలోయింగ్ ని సంపాదించారు. ఈ సీజన్ లో కూడా నామినేషన్స్ ప్రక్రియ చాలా కీలకంగా మారనుంది. నిన్న ఈ నామినేషన్స్ ప్రక్రియ కి సంబంధించిన షూటింగ్ జరిగిందట. ఈ ప్రక్రియ లో సెలబ్రిటీలు ఎక్కువగా రోహిత్ ని టార్గెట్ చేసారని టాక్. ఇది అందరూ ఊహించిందే.
ఎందుకంటే ‘అగ్ని పరీక్ష 2’ లో రోహిత్ చాలా బలమైన కంటెస్టెంట్ అని నిరూపించుకున్నాడు. మాట తీరు లో కానీ , ఆటలు ఆడే విషయం లో కానీ , రోహిత్ కి కనీస స్థాయిలో పోటీ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అలాంటి కంటెస్టెంట్ కాబట్టే, రోహిత్ ని టార్గెట్ చేయడానికి సెలబ్రిటీలు ప్రయత్నం చేస్తారని అందరూ ముందుగానే ఊహించారు. అయితే నిన్నటి బిగ్ బాస్ లైవ్ ని చూస్తే, రోహిత్ మీద నామినేషన్స్ వేయడానికి సెలబ్రిటీలకు కూడా మంచి పాయింట్స్ దొరికాయి అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ పలు టాస్కులు నిర్వహించి , 8 మంది కంటెస్టెంట్స్ కి ‘గోల్డెన్ కీ’ ఇస్తాడు. మొత్తం మీద 10 మంది కంటెస్టెంట్స్ కి గోల్డెన్ కీస్ రావాలి. మిగిలిన రెండు గోల్డెన్ కీస్ ఎవరెవరికి ఇవ్వాలో మీ 8 మంది నిర్ణయించుకోండి అని అంటాడు బిగ్ బాస్.
అప్పుడు వీళ్లంతా ఏకాభిప్రాయం తో వంశీ, కృష్ణుడు కి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. వంశీ కి ఇవ్వడం పై రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. తన వైపు నుండి సరైన పాయింట్స్ కూడా పెడుతాడు. ఇది సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కి నచ్చదు. నిన్న నామినేషన్స్ ప్రక్రియ లో ముకేశ్ , రోహిత్ మధ్య పెద్ద గొడవ జరుగుతుందట. మాటల యుద్ధం వేరేలా ఉంటుందని అంటున్నారు. రోహిత్ తో పాటు షాలిని ని కూడా అత్యధిక శాతం మంది కంటెస్టెంట్స్ నామినేట్ చేశారట. చూడాలి మరి ఈ ప్రక్రియ ఎంతటి హీట్ వాతావరణం లో జరిగింది అనేది.