Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ : తొలిరోజు హైలేట్స్ ఏంటో తెలుసా?

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ : తొలిరోజు హైలేట్స్ ఏంటో తెలుసా?

Bigg Boss Telugu 10 : ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ ‘దేబ్ జానీ’ బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఇవే! ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ దేబ్ జానీ మొదక్. ఈమె వెస్ట్ బెంగాల్ కి చెందిన అమ్మాయి. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ‘సత్య బామ’,’ఎన్నెన్నో జన్మల బంధం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా చేసి మంచి క్రేజ్ ని సొంతం […]

Bigg Boss Telugu 10 : ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ ‘దేబ్ జానీ’ బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఇవే!

‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ దేబ్ జానీ మొదక్. ఈమె వెస్ట్ బెంగాల్ కి చెందిన అమ్మాయి. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ‘సత్య బామ’,’ఎన్నెన్నో జన్మల బంధం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా చేసి మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈమెకు యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్దు ముద్దు మాటలతో నాగార్జున ని సైతం ఆకర్శించిన ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ 10 లో రాణిoచగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.

మొదటి రోజే ‘బిగ్ బాస్ 10’ హౌస్ లో గొడవలు!

బిగ్ బాస్ 10 నేడే గ్రాండ్ గా మొదలైంది. ప్రతీ సీజన్ లోనూ మొదటి ఎపిసోడ్ లోనే నామినేషన్స్ ఉంటాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. నామినేషన్స్ సమయం లో గొడవలు తారా స్థాయిలో జరుగుతుంటాయి. అయితే ఈ సీజన్ లో నామినేషన్స్ కి ముందే గొడవలు జరిగాయట. త్రిగున్ అనే కంటెస్టెంట్ తో రోహిత్, షాలిని పెద్ద గొడవ పెట్టుకున్నారట. మరి గొడవ ఎందుకు జరిగిందో, తప్పు ఎవరిదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

‘బిగ్ బాస్ 10’ లోకి 2వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ ‘త్రిగున్’ ఎవరు? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా!

‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చిన రెండవ కంటెస్టెంట్ పేరు త్రిగున్. చూసేందుకు చాలా డైనమిక్ గా కనిపిస్తున్న ఈయనకి పెళ్ళై ఒక ఏడాది బాబు కూడా ఉన్నాడట. ఇప్పటి వరకు ఈయన మన టాలీవుడ్ లో ఈషా, చెన్నై లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అంతే కాదు ఈయన హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిరోజే రోహిత్ లాంటి టాప్ కంటెస్టెంట్ తో గొడవ పెట్టుకున్నాడు అట. రేపు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మరి త్రిగున్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

రాజకీయ నాయకులను వణికించిన ఈ సుధీర్ రెడ్డి ‘బిగ్ బాస్ 10’ టైటిల్ విన్నర్ అవుతాడా?

యూట్యూబ్ ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ఆధాన్ టాక్స్ సుధీర్. ఇతని అసలు పేరు సుధీర్ రెడ్డి. జీరో నుండి మొదలై 18 లక్షల మంది ఫాలోయర్స్ యూట్యూబ్ లో సంపాదించుకున్నాడు. తన ఇంటర్వ్యూస్ తో రాజకీయ నాయకులను సైతం తికమక పెట్టిన సుధీర్ రెడ్డి. బిగ్ బాస్ హౌస్ లో తన తోటి కంటెస్టెంట్స్ కి ఎలాంటి చుక్కలు చూపిస్తాడో చూడాలి. మరి సుధీర్ రెడ్డి పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper