Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: టెంపర్ వంశీ కి పట్టపగలే చుక్కలు చూపించిన రోహిత్.. దెబ్బకి...

Bigg Boss 10 Telugu: టెంపర్ వంశీ కి పట్టపగలే చుక్కలు చూపించిన రోహిత్.. దెబ్బకి నోటి నుండి మాట రాలేదు!

Bigg Boss 10 Telugu: గత కొన్ని రోజుల నుండి ‘బిగ్ బాస్’ హౌస్ లో టెంపర్ వంశీ రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రతీ విషయం లోనూ దూరిపోయి రోహిత్ పై అరుస్తున్నాడు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వంశీ చొరవ తీసుకొని సెలబ్రిటీలతో చేతులు కలిపి రోహిత్ ని అవమానించడమే డ్యూటీ గా పెట్టుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో అయితే వేరే […]

Bigg Boss 10 Telugu: గత కొన్ని రోజుల నుండి ‘బిగ్ బాస్’ హౌస్ లో టెంపర్ వంశీ రోహిత్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రతీ విషయం లోనూ దూరిపోయి రోహిత్ పై అరుస్తున్నాడు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వంశీ చొరవ తీసుకొని సెలబ్రిటీలతో చేతులు కలిపి రోహిత్ ని అవమానించడమే డ్యూటీ గా పెట్టుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో అయితే వేరే లెవెల్ లో రోహిత్ ని ఎగతాళి చేస్తున్నాడు అనే చెప్పాలి. అలాంటి వంశీ కి నిన్నటి నామినేషన్స్ లో చుక్కలు చూపించాడు రోహిత్. తన మీదకు దూసుకొస్తూ అరుస్తున్న వంశీ పై , అంతకు మించిన ఇంటెన్సిటీ తో దూసుకొచ్చి మాట్లాడాడు రోహిత్. దీంతో కాసేపు వంశీ నోటి నుండి మాట రాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది , రోహిత్ కి ఆయన అభిమానులు వేరే లెవెల్ ఎలివేషన్స్ వేస్తున్నారు.

కేవలం వంశీ ని ఒక్కడినే కాదు , అతని వెనుక దాక్కొని మాటలు అందిస్తున్న త్రిగున్ కి కూడా నిన్నటి నామినేషన్ లో ఇచ్చి పారేసాడు రోహిత్. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే పెద్దల సామెత గుర్తుంది కదా, ఆ సామెత ని లైవ్ గా చూపించాడు రోహిత్. అయితే ఈ వారం వంశీ ని ఎలా అయినా బయటకు పంపేయాలని రోహిత్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. రోహిత్ నామినేషన్స్ లో లేకపోయుంటే ఇది సాధ్యం అయ్యేదేమో కానీ , ఈ వారం వంశీ ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా అసాధ్యమని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే త్రిగున్ నామినేషన్స్ లో లేడు. ఈ సీజన్ లో రోహిత్ తర్వాత అంతటి ఓటు బ్యాంక్ సంపాదించుకున్నది త్రిగున్ మాత్రమే. పైగా ఇతను వంశీ కి చాలా క్లోజ్ ఫ్రెండ్.

కాబట్టి త్రిగున్ కి ఓటు వేసేవాళ్లంతా ఇప్పుడు వంశీ కి వేస్తారు. అదే కనుక జరిగితే ఈ వారం వంశీ సేఫ్ అయిపోతాడు. ఒకవేళ సేఫ్ అయితే మాత్రం వచ్చే వారం నామినేషన్స్ లో మరోసారి రోహిత్ ని ఇతను గట్టిగ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నన్ను లీస్ట్ ఓటింగ్ లో ఉన్నావని మొన్న నన్ను అన్నావు , ఈరోజు చూడు ఆడియన్స్ నన్ను సేవ్ చేశారు అంటూ చెప్పుకుంటాడు. మరోవైపు రోహిత్ కి బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన అమన్ , షాలిని లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది జరిగినా రోహిత్ పై విపరీతమైన టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే నీ వల్లే నీ స్నేహితులు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయ్యారు అనే ఆరోపణ నిన్నటి నామినేషన్ లో అంటాడు త్రిగున్. వచ్చే వారం కూడా ఇదే అంటాడు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper