SS Rajamouli: రాజమౌళి కెరీర్ లో తక్కువ సమయం లో షూటింగ్ ని పూర్తి చేసుకున్న సినిమా ఏమిటి అని అడిగితే, టక్కుమని ‘వారణాసి’ పేరు చెప్పొచ్చు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే లీడ్ క్యాస్ట్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. మహేష్ బాబు కూడా తన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకొని ‘వారణాసి’ లుక్ నుండి కూడా బయటకు వచ్చేసాడు. ఈ నెలాఖరు లోపు ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసి , డిసెంబర్ లోపు గ్రాఫిక్స్ వర్క్ తో పూర్తి కాబడిన మొదటి కాపీ ని రెడీ చేసే పనిలో పడ్డాడట రాజమౌళి. ఇది కాసేపు పక్కనపెడితే వారణాసి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా లో అనేక వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
కొంతమంది రాజమౌళి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టుగా ప్రచారం చేశారు. మరికొందరు అయితే ప్రభాస్ తో ‘బాహుబలి 3’ ని ప్రారంభిస్తాడని చెప్పగా , లేదు ఎన్టీఆర్ తో సినిమాని మొదలు పెట్టబోతున్నాడని ప్రచారం చేశారు. తమిళ హీరో సూర్య తో కూడా రాజమౌళి సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ వీటిల్లో ఎలాంటి నిజం లేదు. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేయడం లేదు, ఒక లైవ్ యానిమేషన్ చిత్రాన్ని చేయబోతున్నట్టు సమాచారం. హాలీవుడ్ లో ఇలాంటి లైవ్ యానిమేషన్ చిత్రాలను మనం చాలానే చూసాము. ఉదాహరణకు లయన్ కింగ్ చిత్రాన్ని తీసుకోండి. లైవ్ యానిమేషన్ చిత్రాల క్యాటగిరీలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేసింది.
రాజమౌళి కూడా ఆ తరహా లైవ్ యానిమేషన్ చిత్రాన్ని ప్లాన్ చేసే పనిలో పడ్డాడట. #RRR తో రాజమౌళి కి హాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘వారణాసి’ కూడా హాలీవుడ్ లో సంచలనాలు నెలకొల్పేందుకు రెడీ అవుతోంది. కాబట్టి రాజమౌళి తెరకెక్కించాలని అనుకుంటున్న లైవ్ యానిమేషన్ చిత్రానికి హాలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఎంతటి సంచలనాలకు దారి తీయబోతుంది అనేది.త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందట.