Buchhi Babu: మరికొద్ది గంటల్లోనే విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చి బాబు మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. విజయ్ దేవరకొండ కి పవన్ కళ్యాణ్ రేంజ్ క్రేజ్ ఉందని, ఇది సాధారణమైన విషయం కాదంటూ ప్రసంగించాడు . దీనికి పవన్ ఫ్యాన్స్ అసలు విజయ్ దేవరకొండ తో పోల్చడం ఏంటి?, కావాలని ఇలా చేశాడా ? అంటూ మండిపడుతున్నారు. పవన్ స్థాయి ని ఎవరితో పోల్చదగినది కాదని , ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్. దీనిపై ఇప్పటి వరకు అయితే బుచ్చి బాబు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. బహుశా సోషల్ మీడియా లోని ఈ ట్రోల్స్ ఇంకా ఆయన వద్దకు చేరి ఉండకపోయుండొచ్చు.
అయితే బుచ్చి బాబు కావాలని ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ తో విజయ్ దేవరకొండ క్రేజ్ ని పోల్చలేదని అంటున్నారు నెటిజెన్స్. క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి విషయాల గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎవరైనా పవన్ కళ్యాణ్ తోనే పోలుస్తారు కదా , ఆ ఉద్దేశ్యం తోనే బుచ్చి బాబు పోల్చి ఉంటాడని , పవన్ కళ్యాణ్ , విజయ్ దేవరకొండ సమానం అనే అర్థం వచ్చేలా ఆయన ఏమి మాట్లాడలేదని , పవన్ ఫ్యాన్స్ కాస్త శాంతించాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సర్దిచెప్తున్నారు. ఇక రణబాలి చిత్రం విషయానికి వస్తే , ఎల్లుండి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది.
పైగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత విడుదల కాబోతున్న సినిమా కావడం తో అంచనాలు మరింత పెరిగాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా స్లో గా ఉన్నాయి. గ్లింప్స్ వీడియో విడుదలైన కొత్తల్లో కచ్చితంగా ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని సాదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆయన కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టబోతున్న సినిమాగా మిగలబోతుంది. కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి ఓపెనింగ్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నెటిజెన్స్.