Homeఎంటర్టైన్మెంట్Renu Desai: తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది... పవన్ కళ్యాణ్ ఫోటో పై రేణు...

Renu Desai: తల్లి శాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది… పవన్ కళ్యాణ్ ఫోటో పై రేణు దేశాయ్ సంచలన పోస్ట్!

Renu Desai: రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె తనపై చేసే కామెంట్స్ కి కూడా స్పందిస్తూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె ఎంతగానో ఆవేదన చెందారు. విషయంలోకి వెళితే.. గతంలో రేణు దేశాయ్ ప్రధాని మోడీతో అకీరా దిగిన ఫోటో షేర్ చేశారు. నేను మోడీ అభిమానిని, ఆయనను అకీరా కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని కామెంట్ చేశారు.

నిజానికి ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లేకుండా ఫోటో కట్ చేసి రేణు దేశాయ్ పెట్టారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. కాగా జూన్ 12న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ వేడుకకు కూతురు ఆద్య, కొడుకు అకీరా సైతం హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిశాక కారులో హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకీరా, ఆద్య బయలు దేరారు. మార్గం మధ్యలో నలుగురు ఓ ఫోటో దిగారు.

సదరు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు మీమ్స్ రూపొందించారు. గతంలో రేణు దేశాయ్ అకీరా, పవన్ కళ్యాణ్, మోడీ ఫోటోను ఆమె ఎడిట్ చేశారు. ఇప్పుడు అన్నా లెజినోవా లేకుండా ఆమె ఎడిట్ చేస్తారంటూ మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ మీమ్స్ రేణు దేశాయ్ దృష్టికి వెళ్లాయి. దాంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన కూతురు ఆద్య చాలా బాధపడింది. ఆమె కన్నీళ్ల ఉసురు ఆ మీమ్స్ క్రియేట్ చేసిన వాళ్లకు తగులుతాయని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

Also Read: Shankar Bharateeyudu 2: శంకర్ భారతీయుడు 2 కోసం అనిరుధ్ ను తీసుకొని తప్పు చేశాడా..?

ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు రాక్షసులు. సమాజానికి వీరి వలన చాలా ప్రమాదం అని ఆమె ఆక్రోశం వ్యక్తం చేశారు. అలాగే తల్లి శాపం వాళ్లకు తప్పకుండా తగులుతుందని రాసుకొచ్చింది. రేణు దేశాయ్ ఆ మీమ్స్ చూసి బాగా హర్ట్ అయ్యారని ఆమె కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. కాగా రేణు దేశాయ్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. నటిగా మరలా ఆమె బిజీ అవుతున్నారు.

Also Read: Allu Arjun: పవన్ కళ్యాణ్ ను కలువబోతున్న అల్లు అర్జున్… డీల్ సెట్ చేసిన టాప్ ప్రొడ్యూసర్…

RELATED ARTICLES

Most Popular