Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరినైనా అభిమానించడం ప్రారంభిస్తే , వాళ్ళని ఏ రేంజ్ లో అభిమానిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అవసరమైతే ప్రాణాలను కూడా ఇచ్చేస్తారు. కానీ వాళ్ళ ద్వేషం కూడా భరించలేనిది. ఎవరినైనా టార్గెట్ చేస్తే తట్టుకోలేరు. అయితే కీలక సమయం లో తమ అభిమాన హీరో కి తిరుగులేని బ్లాక్ బస్టర్ ని అందించిన డైరెక్టర్స్ అంటే కూడా వాళ్లకు చెప్పలేనంత ప్రేమ. అలాంటి ప్రేమని సొంతం చేసుకున్న డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా చెప్పుకునే ఈయన , ఆయనతో గత ఏడాది చేసిన ‘ఓజీ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాడు , రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు, ఇక ఆయన నుండి సినిమాలను ఆశించడం కష్టం అని అభిమానులు సైతం ఆశలు వదిలేసుకున్న రోజులవి.
ఒకవేళ బలవంతంగా సినిమాలు చేసినా ‘హరి హర వీరమల్లు’ లాంటి సినిమాలు వస్తాయి , ఆయన నుండి మంచి సినిమాలను ఆశించలేం అంటూ అభిమానుల్లో పోస్టులు పెట్టుకున్న రోజులవి. అలాంటి రోజుల్లో ‘ఓజీ’ లాంటి సినిమాని అందించేలోపు ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ చూడని యాంగిల్ లో చూపించే లోపు జెన్ జీ యూత్ మొత్తం ఊగిపోయింది. అందుకే వాళ్లంతా సుజిత్ మీద పిచ్చి ఇష్టాన్ని పెంచుకున్నారు. ఆయన రుణం తీర్చుకోలేనిది అనే రేంజ్ లో తయారైంది పరిస్థితి. అందుకు ఒక ఉదాహరణ మీ ముందు ఉంచబోతున్నాము. రీసెంట్ గానే 2025 వ సంవత్సరానికి గానూ ‘సైమా అవార్డ్స్’ నామినేషన్స్ ని ప్రకటించారు. ఈ సైమా అవార్డ్స్ ని ఓట్ల ఆధారంగా ఇస్తారు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ రేసులో ఓజీ మూవీ నుండి ఉత్తమ నటుడు క్యాటగిరీ లో పవన్ కళ్యాణ్ ఉండగా , ఉత్తమ సంగీత దర్శకుడు విభాగం లో తమన్ , ఉత్తమ డైరెక్టర్ విభాగం లో సుజిత్ ఉన్నారు.
పవన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి ఓట్లు వెయ్యమని గట్టిగా ప్రచారం చెయ్యాలి, కానీ అందుకు బదులుగా సుజిత్ కి ఓట్లు వేయాల్సిందిగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ వీడియో ఎడిట్స్ , ఫోటో ఎడిట్స్ కూడా ఆయన పై చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఎలాగో ఓట్లు పడుతాయి , కానీ సుజిత్ కి ఓట్లు పడడం ముఖ్యం , అందుకే ప్రచారం చేస్తున్నాం. ఓజీ లాంటి సినిమాని మాకు అందించినందుకు గానూ ఆయనకు మా అభిమానుల తరుపున ఇచ్చే చిరు కానుక ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుజిత్ కి అవార్డు వస్తుందా లేదా అనేది చూడాలి.