Homeఎంటర్టైన్మెంట్Bloody Romeo Shooting: అక్టోబర్ నుండి 'బ్లడీ రోమియో' షూటింగ్ మొదలు.. 'ఓజీ 2' ని...

Bloody Romeo Shooting: అక్టోబర్ నుండి ‘బ్లడీ రోమియో’ షూటింగ్ మొదలు.. ‘ఓజీ 2’ ని గాలికి వదిలేసిన సుజిత్?

Bloody Romeo Shooting: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ చిత్రం పై కోటి ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ చిత్రమే పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అవ్వొచ్చు, ఆ తర్వాత ఆయన తన సమయాన్ని మొత్తం పాలనపై కేటాయించడానికి సిద్ధమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రీసెంట్ గానే ‘ఓజీ 2’ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జరిగింది. అభిమానులు ఈ ప్రకటన ని ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సుజిత్ కూడా […]

Bloody Romeo Shooting: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ చిత్రం పై కోటి ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ చిత్రమే పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అవ్వొచ్చు, ఆ తర్వాత ఆయన తన సమయాన్ని మొత్తం పాలనపై కేటాయించడానికి సిద్ధమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రీసెంట్ గానే ‘ఓజీ 2’ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా జరిగింది. అభిమానులు ఈ ప్రకటన ని ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సుజిత్ కూడా ‘ఓజీ 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెల నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందని టాక్ కూడా గట్టిగా నడిచింది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే , డైరెక్టర్ సుజిత్ నాని తో ‘బ్లడీ రోమియో’ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ ఏడాది అక్టోబర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారట. మొదటి షెడ్యూల్ ని హైదరాబాద్ లో చేస్తారట. ఆ తర్వాత ఒక భారీ షెడ్యూల్ ని లండన్ లో చేస్తారట. ఆ షెడ్యూల్ తో ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చెయ్యాలని చూస్తున్నాడట డైరెక్టర్ సుజిత్. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?, ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలే లేదా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ‘ఓజీ 2’ షూటింగ్ ఈ ఏడాది లో ఉండదని , వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఈ విషయం ముందుగానే చెప్పాడట. పవన్ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం.

ఎలాగో తనకు రెండు భుజాలకు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది , కుడి భుజానికి రీసెంట్ గానే సర్జరీ జరిగింది , మూడు నెలల తర్వాత ఎడమ చేతికి కూడా సర్జరీ జరగనుంది. ఈ రెండు భుజాలకు సర్జరీ జరిగి , పూర్తిగా పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి 6 నెలలకు పైగానే సమయం పడుతుందట, ఈ గ్యాప్ లో నీకు ఉన్న కమిట్మెంట్ ని పూర్తి చేసుకోమని సుజిత్ కి పవన్ కళ్యాణ్ చెప్పాడట. ఆయన అనుమతి తోనే ఇప్పుడు అక్టోబర్ నెల లో సుజిత్ ‘బ్లడీ రోమియో’ షూటింగ్ కి షిఫ్ట్ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక వెంటనే ‘ఓజీ 2’ షూటింగ్ పనులను మొదలు పెడుతాడట సుజిత్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper