Homeఎంటర్టైన్మెంట్Crazy Kalyanam rivew: సందేశం మంచిదే.. కథనమే దెబ్బకొట్టింది..

Crazy Kalyanam rivew: సందేశం మంచిదే.. కథనమే దెబ్బకొట్టింది..

Crazy kalyanam rivew: ఆడపిల్ల పుడితే చదువు కంటే పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించే తల్లిదండ్రుల మనస్తత్వం పూర్తిగా మారాలి అనే మంచి సందేశంతో క్రేజీ కళ్యాణం (crazy Kalyanam review) రూపొందింది. అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు నరేష్.. తరుణ్ భాస్కర్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది.. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని తెరమీద సమర్థవంతంగా ఆవిష్కరించగలిగాడా.. కథ, కథనం, నటీనటులు, పనితీరు ఎలా ఉంది. ఈ రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథేంటంటే […]

Crazy kalyanam rivew: ఆడపిల్ల పుడితే చదువు కంటే పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించే తల్లిదండ్రుల మనస్తత్వం పూర్తిగా మారాలి అనే మంచి సందేశంతో క్రేజీ కళ్యాణం (crazy Kalyanam review) రూపొందింది. అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు నరేష్.. తరుణ్ భాస్కర్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది.. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని తెరమీద సమర్థవంతంగా ఆవిష్కరించగలిగాడా.. కథ, కథనం, నటీనటులు, పనితీరు ఎలా ఉంది. ఈ రివ్యూలో తెలుసుకుందాం.

సినిమా కథేంటంటే

పర్వతాలు (నరేష్) కు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి భర్త (తరుణ్ భాస్కర్) తాగుడుకు బానిస అవుతాడు. ఎటువంటి ఉద్యోగం చేయకుండా కుటుంబానికి ఇబ్బందికరంగా మారతాడు. దీంతో చిన్న కూతురు కైనా మంచి సంబంధం చూడాలని పర్వతాలు అనుకుంటాడు. ఎటువంటి అలవాట్లు లేని, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అల్లుడిగా తెచ్చుకోవాలని అనుకుంటాడు.చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించాలి.. తన కాళ్ళ మీద నిలబడాలి అనేది ఆమె ఆశయం. చిన్నప్పటినుంచే తనను ప్రేమిస్తున్న ఉదయ్ (అఖిల్ రాజ్) ను ఆమె ఇష్టపడుతుంది. కానీ ఉదయ్ కి ఉద్యోగ అనకపోవడంతో ఈ పెళ్లికి పర్వతాలు అంగీకరించడు. ఈ విషయం కీర్తికి కూడా తెలుసు.ఇదే సమయంలో పర్వతాలు తన చిన్న కూతురికి గొప్ప సంబంధాన్ని ఖాయం చేస్తాడు. ఈ స్థితిలో కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంది.. తన జీవితం మీద తనకు హక్కు ఉందని తండ్రికి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పగలిగింది.. ఈ అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

కథనమే రకరకాలుగా..

ఆడపిల్లలకు చదువు.. ఉద్యోగం.. ఆర్థిక స్వాతంత్రం ఎంత ముఖ్యమో చెప్పడం ఈ సినిమా ప్రధాన ఉద్దేశం. కూతురికి ఉత్తమమైన సంబంధం తీసుకురావడమే తండ్రి బాధ్యత కాదని.. అభిప్రాయాలు కూడా గౌరవించి.. తన కలలను సాకారం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని ఈ చిత్రం చెబుతుంది.మన సమాజంలో ఇప్పటికీ కనిపించే ఒక ఆలోచన ధోరణిని కథలాగా ఎంచుకోవడం గొప్ప విషయం.. పైగా ఈ సినిమాలో అనుపమ.. నరేష్.. తరుణ్ వంటి నటీనటులు ఉన్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కథను నడిపించడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు. అయితే మంచి ఆలోచన ఉన్నప్పటికీ, సినిమాను ప్రాపర్ వే లో ఎగ్జిక్యూట్ చేస్తేనే బాగుంటుంది. కానీ ఈ సినిమాలో అదే దెబ్బ కొట్టింది.

దాని కోసమే 30 నిమిషాలు..

సినిమా ప్రారంభమైన తర్వాత పాత్రల పరిచయాలు.. వాటి నేపథ్యాలను వివరించడానికి దర్శకుడు చాలాసార్లు తీసుకున్నాడు. తొలి 30 నిమిషాల పాటు సినిమా అత్యంత భారంగా సాగుతూ ఉంటుంది. కీర్తి, ఉదయ్ మధ్య ప్రేమ కథ కూడా అంత ఇంట్రెస్టింగా అనిపించదు.పర్వతాలు తన అన్నయ్య కూతురికి వచ్చిన సంబంధాన్ని తన చిన్న కూతురి కోసం మళ్ళించడం దగ్గర నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. అక్కడి నుంచి కథనం బేగం పెరుగుతుంది. వరుసగా ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరిగితే.. సినిమా ఎక్కడికో వెళ్ళేది. కానీ ఆశించిన స్థాయిలో ఉత్కంఠ కల్పించదు.. ఇంటర్వెల్ కి ముందు కూడా ఏం జరుగుతుందనే అంత ఆసక్తిగా ఉండదు. తరుణ్ భాస్కర్ దొర కొంత మేర కామెడీ అందించే ప్రయత్నం చేసినప్పటికీ.. అది పూర్తి స్థాయిలో సినిమా నిలబెట్ట లేకపోయింది.

కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే..

ఇక సెకండ్ ఆఫ్ లో హీరోయిన్ ఇంగ్లీష్ క్లాసులు తీసుకునే సన్నివేశాలు.. గ్రామంలో జరిగే కొన్ని వ్యవహారాలు కథను ముందుకు తీసుకెళ్లవు. ఇవి కథనాన్ని ముందుకు నడిపించడానికి బదులుగా లాగ్ భావన తీసుకొస్తాయి. అయితే సినిమా చివరి 30 నిమిషాలలో దర్శకుడు కథను వేగంగా నడిపించే ప్రయత్నం చేశాడు. పరదాల చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు భావోద్వేగాన్ని పండిస్తాయి. నరేష్ తన నటనతో ఈ సన్నివేశాలకు ప్రాణం పోశారు. ఆయన పలికిన మాటలు కదిలిస్తాయి.చివరికి ఆడపిల్ల చదువుకోవడం.. ఉద్యోగం చేయడం.. తన జీవితానికి సంబంధించి తానే నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో తండ్రి అర్థం చేసుకున్న తర్వాత ఈ సినిమా కథ ముగుస్తుంది. ఈ విషయంలో మాత్రం దర్శకుడు తాను చెప్పాలి అనుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేగలిగాడు. అయితే తరుణ్ భాస్కర్ పాత్రను మరింత బలంగా చూపించడానికి పుట్టిన ఫైట్ మాత్రం కథలో అంత సహజంగా అతకలేదు. ఆ సీన్ కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది.

నటీనటులు ఎలా చేశారంటే..

అనుపమ పరమేశ్వరన్: కీర్తి పాత్రలో అనుపమ సహజంగా నటించింది. తెలంగాణ యాసను చక్కగా పలికించింది. పాత్రకు అవసరమైన చిన్న చిన్న వివరాలను కూడా జాగ్రత్తగా ప్రదర్శించింది. పాత్రను అర్థం చేసుకొని.. ఆమె నటించిన తీర్పు మంచి మార్కులు పడతాయి.

నరేష్: పర్వతాలు పాత్రలో నరేష్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ముఖ్యంగా చివరి అరగంటలో మాత్రం ఆయన నటన ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది. భావోద్వేగా సన్నివేశంలో తన అనుభవాన్ని ఆయన చూపించారు. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు.

తరుణ్ భాస్కర్: ఈయన తన పాత్ర ద్వారా వినోదాన్ని పండించారు. కాని దర్శకుడు వినను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయాడు.

అఖిల్ రాజ్: ఈయన నటించిన ఉదయ్ పాత్ర పరిధి మేరకే ఉంటుంది. అయితే ఈ సినిమా ద్వారా ఆయనకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీలకు సంబంధించి ఈయన స్క్రీన్ ప్రజెన్స్ సరిపోతుంది.

ఎంచుకున్న పాయింట్ లో నిజాయితీ ఉన్నప్పటికీ..

చిన్న సినిమా అయినప్పటికీ సాంకేతికపరంగా క్రేజీ కల్యాణం బాగానే ఉంది. కెమెరా వర్క్ కు వంక పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఎడిటింగ్ కు ఇంకా పదులు పెట్టాలి. పాటలు కూడా ఎక్కువైన భావన కలుగుతుంది. కథలోని మంచి పాయింట్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ను తీసుకెళ్లగలిగితే సినిమా ఫలితం మరో విధంగా ఉండేది. క్రేజీ కల్యాణంలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్ లో నిజాయితీ ఉంది. ఆడపిల్లలకు చదువు.. ఉద్యోగం.. స్వతంత్రంగా జీవించే అవకాశం కల్పించాలి అనే సందేశం బాగుంది. అయితే మొదటి భాగంలో వినోదం.. కథనంలో వేగం.. సన్నివేశారులు ఆసక్తి లేకపోవడంతో సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేక పోతుంది. చివరి 30 నిమిషాల మాత్రం నరేష్ నటన.. భావోద్వేగ సన్నివేశాలు సినిమాను కొంతవరకు నిలబెడతాయి. అనుపమ నటన కూడా ఆకట్టుకుంటుంది. బలమైన కథనంతో.. మరింత ఆసక్తికరమైన సన్నివేశాలతో తీసి ఉంటే క్రేజీ కల్యాణం ఉత్తమ సినిమాగా నిలిచి ఉండేది..

స్థూలంగా చెప్పాలంటే మంచి సందేశం ఉన్నప్పటికీ.. బలహీనమైన కథనం కారణంగా ఒక స్థాయి అనుభూతిని మిగుల్చుతుంది క్రేజీ కల్యాణం.

బాటమ్ లైన్.. క్రేజీ కల్యాణం.. అనుకున్నంత క్రేజీ కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper