Homeఎంటర్టైన్మెంట్Ram Charan: సీఎం విజయ్ కొడుకు దర్శకత్వంలో రామ్ చరణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా...

Ram Charan: సీఎం విజయ్ కొడుకు దర్శకత్వంలో రామ్ చరణ్..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Ram Charan: సౌత్ లో కలలో కూడా సాధ్యం అవ్వవు అనుకున్న కాంబినేషన్స్ ని నేటి జనరేషన్ ప్రేక్షకులు చూస్తున్నారు. ఆరోజుల్లో ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తే పెద్ద వింత. ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు యుగం లో మల్టీ స్టార్రర్ చిత్రాలు సర్వ సాధారణమే కానీ , చిరంజీవి యుగం లో మాత్రం సాధయపడేది కాదు. కానీ నేటి తరంలో కుర్ర హీరోలు , పెద్ద పెద్ద […]

Ram Charan: సౌత్ లో కలలో కూడా సాధ్యం అవ్వవు అనుకున్న కాంబినేషన్స్ ని నేటి జనరేషన్ ప్రేక్షకులు చూస్తున్నారు. ఆరోజుల్లో ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తే పెద్ద వింత. ఎన్టీఆర్ , ఏఎన్నార్ , కృష్ణ , శోభన్ బాబు యుగం లో మల్టీ స్టార్రర్ చిత్రాలు సర్వ సాధారణమే కానీ , చిరంజీవి యుగం లో మాత్రం సాధయపడేది కాదు. కానీ నేటి తరంలో కుర్ర హీరోలు , పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం ఎలాంటి బేషజాలు లేకుండా మల్టీస్టార్రర్ సినిమాలు చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ #RRR. ఇప్పుడు మరోసారి అలాంటి కాంబినేషన్ రిపీట్ అవ్వబోతుంది అని చెప్పలేము కానీ , ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ మాత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం లో ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వం లో సందీప్ కిషన్ హీరో గా ‘సిగ్మా’ అనే చిత్రం తెరకెక్కింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే జేసన్ సంజయ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నాడని సోషల్ మీడియా లో ఒక చర్చ నడుస్తోంది. రీసెంట్ గానే సంజయ్ రామ్ చరణ్ ని కలిసి ఒక విభిన్నమైన స్టోరీ లైన్ ని వినిపించాడట. అది రామ్ చరణ్ కి తెగ నచ్చేసింది సమాచారం. పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ తో ఒక్కసారి వచ్చి వివరిస్తే ఈ సినిమా చేద్దామని చెప్పినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట. ఒకవేళ సంజయ్ దర్శకత్వం రామ్ చరణ్ హీరో గా తెరకెక్కితే ఆ సినిమాకు సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

అయితే సందీప్ కిషన్ ని డీల్ చేయడం వేరు , రామ్ చరణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని డీల్ చేయడం వేరు. ఇంత చిన్న వయస్సు లో అంత పెద్ద సూపర్ స్టార్ ని డీల్ చేయగలడా లేదా అనే సందేహం అభిమానుల్లో ఉంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే సంజయ్ పేరు సౌత్ లో మారుమోగిపోతుంది. మరో లోకేష్ కనకరాజ్ రేంజ్ డైరెక్టర్ అయిపోవచ్చు. మరి ఆయనలో అంత టాలెంట్ ఉందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక సంజయ్ తో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper