Homeఎంటర్టైన్మెంట్Kalyan Padala: కళ్యాణ్ పడాల కి లైవ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మెగా ఫ్యాన్స్..వైరల్...

Kalyan Padala: కళ్యాణ్ పడాల కి లైవ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మెగా ఫ్యాన్స్..వైరల్ అవుతున్న వీడియో..

Kalyan Padala: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో అభిమానులు , సినిమా సెలబ్రిటీలు ఏ స్థాయిలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. బయట మాత్రమే కాదు , సోషల్ మీడియా లో కూడా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణం ని తలపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వేసిన ట్వీట్లు అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే, చిరంజీవి పుట్టినరోజు […]

Kalyan Padala: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో అభిమానులు , సినిమా సెలబ్రిటీలు ఏ స్థాయిలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. బయట మాత్రమే కాదు , సోషల్ మీడియా లో కూడా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణం ని తలపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వేసిన ట్వీట్లు అభిమానుల హృదయాలను హత్తుకున్నాయి. ఇదంతా పక్కన పెడితే, చిరంజీవి పుట్టినరోజు కి ముందు రోజున హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో అభిమానులు భారీ స్థాయిలో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హజారై , మెగాస్టార్ గొప్పతనం గురించి చెప్తూ , ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని తల్చుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఈ ఈవెంట్ కి హాజరైన సెలబ్రిటీలలో ‘బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల కూడా ఉన్నాడు. ఆయన చిరంజీవి గురించి మాట్లాడుతున్న సమయం లో మెగా ఫ్యాన్స్ క్రింది నుండి వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయానికి వస్తే ‘బిగ్ బాస్ 9’ షో చూసిన ఎవరికైనా కళ్యాణ్ పడాల మాట తీరు ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది. ఎక్కువగా ఆయన తన తోటి వ్యక్తి ని ‘అతను’ అని అంటుంటాడు. అది ఆయనకు అలవాటు. అలా మొన్న చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడుతూ మధ్యలో ‘అతను’ అని అంటాడు. అందుకు క్రింది నుండి మెగా ఫ్యాన్స్ గట్టిగ అరుస్తూ ‘అతను’ కాదు , మర్యాదగా మాట్లాడు అని వార్నింగ్ ఇస్తారు. దీంతో కళ్యాణ్ పడాల ‘క్షిణించండి బ్రో.. నాకు తెలియదు’ అని సమాధానం చెప్తాడు. ఒక్కసారిగా అక్కడ ఏర్పడిన ఈ వాతావరణం పాపం కళ్యాణ్ పడాల ని కాస్త కంగారుకి గురి చేసింది.

ఇలా మాట్లాడినందుకు సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ పడాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ ‘బిగ్ బాస్ 9’ ని అనుసరిస్తూ , కళ్యాణ్ పడాల ఎలా వ్యవహరిస్తాడో తెలిసిన వాళ్ళు మాత్రం , వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు , ఇదే ప్రసంగం లో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ‘గారు’ అనబోయే , ‘గాడు’ అనేస్తాడు కళ్యాణ్ పడాల. మొదటి సారి అంత పెద్ద ఈవెంట్ లో మాట్లాడే లోపు కళ్యాణ్ పడాల కాస్త తడబడినట్టు ఉన్నదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by T3 News Telugu (@t3_news_telugu)

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper