Homeఎంటర్టైన్మెంట్Ram Charan: చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో...

Ram Charan: చిరంజీవి పుట్టినరోజు స్పెషల్.. అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో వైరల్..

Ram Charan: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా , సోషల్ మీడియా lo సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు. వీళ్లందరిలో పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వంటి వారు మెగాస్టార్ చిరంజీవి గురించి వేసినటువంటి ఎమోషనల్ ట్వీట్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత ఇతర సినీ సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో ట్వీట్లు వేస్తూ , చిరంజీవి పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కానీ చిరంజీవి తనయుడు గ్లోబల్ […]

Ram Charan: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా , సోషల్ మీడియా lo సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు. వీళ్లందరిలో పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వంటి వారు మెగాస్టార్ చిరంజీవి గురించి వేసినటువంటి ఎమోషనల్ ట్వీట్స్ బాగా హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత ఇతర సినీ సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో ట్వీట్లు వేస్తూ , చిరంజీవి పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కానీ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఒకే ఇంట్లో , పక్కపక్కనే ఉంటారు, సోషల్ మీడియా లో శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముందిలే అని కొంతమంది అభిమానులు అనుకోగా , మరికొంత మాత్రం చిరంజీవి ప్రతీ రామ్ చరణ్ పుట్టినరోజు కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తాడు కదా, మరి రామ్ చరణ్ ఎందుకు చెప్పకూడదు అని అంటున్నారు.

అలా అందరూ అనుకుంటున్న సమయంలోనే సోషల్ మీడియా నుండి ఒక వీడియో విడుదలైంది. ఈ వీడియోలో వందల సంఖ్యలో అభిమానులు చిరంజీవి ఇంటికి చేరుకోగా, వాళ్ళని పలకరించేందుకు రామ్ చరణ్ స్వయంగా గేటు వద్దకు వచ్చి , అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ , అభివాదం చేశారు. ఈ అభిమానుల్లో గబ్బర్ సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ఉండడం గమనార్హం. రీసెంట్ గానే ఈ గ్యాంగ్ లోని రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ రాగా , ఆయన్ని హాస్పిటల్ కి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే. అతని హాస్పిటల్ కి అయ్యే బిల్లు 28 లక్షలు కట్టడమే కాకుండా, ఎప్పటికప్పుడు చిరంజీవి , రామ్ చరణ్ అతని ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారట. ఈ విషయాన్నిస్వయంగా గబ్బర్ సింగ్ అంత్యాక్షరి టీం నేడు మీడియా కి తెలిపారు.

నేడు రామ్ చరణ్ ని చూడగానే వీళ్ళు ఎమోషనల్ అయిపోయిన విధానాన్ని చూస్తే , వాళ్లకు మెగా ఫ్యామిలీ ఏ స్థాయిలో అండగా నిలబడిందో అర్థం అవుతోంది. అయితే రామ్ చరణ్ తో పాటు , చిరంజీవి కూడా అభిమానులకు ఇంటి వద్ద అభివాదం చేసుంటే బాగుండేది అని సోషల్ మీడియా లో కొంతమంది అంటున్నారు. కానీ చిరంజీవి ప్రస్తుతం ‘కాకా’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడట. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ విడుదల అవ్వగా, దానికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రామ్ చరణ్ అభిమానులను కలిసిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper