Homeఎంటర్టైన్మెంట్Ponnam Balam Actor: వందల కోట్లు సంపాదించిన నటుడు.. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో.. పూర్తి...

Ponnam Balam Actor: వందల కోట్లు సంపాదించిన నటుడు.. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో.. పూర్తి వివరాలు చూస్తే ఏడుపు ఆపుకోలేరు..

Ponnam Balam Actor:  సినీ ఇండస్ట్రీ లో ఒక నటుడు ఎప్పుడూ ఒక స్థాయిలో ఉండలేడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వరుస ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సిందే. కష్టకాలం తప్పదు. అయితే ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా చెక్కు చెదరని ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అదృష్టవంతులు అనే అనుకోవాలి. వాళ్లకు ఆ స్థాయి ఊరికే రాలేదు కానీ, ఇండస్ట్రీ లో బలంగా నాటుకుపోయారు , ఎలాంటి పరిస్థితి వచ్చినా తమ […]

Ponnam Balam Actor:  సినీ ఇండస్ట్రీ లో ఒక నటుడు ఎప్పుడూ ఒక స్థాయిలో ఉండలేడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వరుస ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సిందే. కష్టకాలం తప్పదు. అయితే ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా చెక్కు చెదరని ఇమేజ్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అదృష్టవంతులు అనే అనుకోవాలి. వాళ్లకు ఆ స్థాయి ఊరికే రాలేదు కానీ, ఇండస్ట్రీ లో బలంగా నాటుకుపోయారు , ఎలాంటి పరిస్థితి వచ్చినా తమ కెరీర్ కి డోకా లేదు అనే విధంగా ఉంటుంది. కానీ కొంతమంది ఆర్టిస్టులు మాత్రం దురదృష్టం కొద్దీ కోట్ల రూపాయిల ఆస్తులను కోల్పోతూ ఉంటారు. వందల సినిమాల్లో నటించి ఉంటారు , కానీ వయస్సు వచ్చాక చేతిలో రూపాయిల లేక ఇబ్బంది పడుతుంటారు. ఒకప్పుడు ఇంద్ర భవనం లాంటి నివాసం లో నివసించిన ఆర్టిస్టులు, ఇప్పుడు చిన్న ఇంట్లో గడుపుతూ ఉన్న వాళ్ళు సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు.

అలాంటి ఆర్టిస్టులలో ఒకరు పొన్నం బలం. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో తెలుగు , తమిళ భాషల్లో ఎన్నో వందల సినిమాల్లో నటించిన ఈయన , ఈమధ్య కాలం లో ఎంతటి దయనీయమైన స్థితికి వచ్చాడో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇతన్ని స్వయంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఆయన ఆపరేషన్ కి అయ్యే ఖర్చులు మొత్తం మెగాస్టార్ భరించి, పునర్జన్మ ని ఇచ్చాడు. నేడు ఈ నటుడు ఉంటున్న ఇల్లు చూస్తే కన్నీళ్లు రాక తప్పదు. ఒకప్పుడు ఎలాంటి బ్రతుకు బ్రతికిన మనిషి , ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కి వచ్చాడేంటి అనే బాధ ఆయన్ని చూసిన వెంటనే కలుగుతుంది. సోషల్ మీడియా లో ఆయన ఇంటికి సంబంధించిన వీడియో ఒకటి మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు నేను మీ ముందు ఇలా ప్రాణాలతో నిల్చొని ఉన్నానంటే, అందుకు ముఖ్య కారణం చిరంజీవి గారు. ఆరోగ్యం బాగాలేదని చిరంజీవి గారికి సమాచారం అందించిన వెంటనే , కేవలం రెండు నిమిషాల్లో నాతో కాంటాక్ట్ లోకి వచ్చారు. నా ఆపరేషన్ కి సంబంధించి మొత్తం ఆయనే చూసుకున్నాడు. దాదాపుగా 50 లక్షలు ఖర్చు అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు పొన్నం బలం. ఇది ఎన్నో సందర్భాల్లో , పలు ఇంటర్వ్యూస్ లో పొన్నం బలం చెప్పుకొచ్చాడు. ఇప్పటికే కూడా ఆయన ఆ విషయాన్ని చెప్పుకుంటుడంటే, ఆయనకు చిరంజీవి పట్ల ఎంత కృతజ్ఞతా ఉందో అర్తం చేసుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper