Homeఎంటర్టైన్మెంట్Sigma Movie Review: 'సిగ్మా' మూవీ ఫుల్ రివ్యూ..ఇదేమి సినిమా అయ్యా.. అసలు ఊహించలేదు!

Sigma Movie Review: ‘సిగ్మా’ మూవీ ఫుల్ రివ్యూ..ఇదేమి సినిమా అయ్యా.. అసలు ఊహించలేదు!

Sigma Movie Review: సందీప్ కిషన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సిగ్మా’ నేడు తెలుగు , తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వల్లే , ఇంత హైప్ ఏర్పడింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన పాటలు , టీజర్ , ట్రైలర్ కి కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ విజయ్ కొడుకు దర్శకత్వం కాబట్టి […]

Sigma Movie Review: సందీప్ కిషన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సిగ్మా’ నేడు తెలుగు , తమిళ భాషల్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం వల్లే , ఇంత హైప్ ఏర్పడింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన పాటలు , టీజర్ , ట్రైలర్ కి కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ విజయ్ కొడుకు దర్శకత్వం కాబట్టి , ఒక్కసారి కచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమాని చూడాలి అనే ఉద్దేశ్యం తో అభిమానులు ఉండడం తో, అడ్వాన్స్ బుకింగ్స్ ఇటు తెలుగు లోనూ, అటు తమిళం లోనూ డీసెంట్ గా జరిగాయి. మరి సందీప్ కిషన్ , సంజయ్ లు ఆడియన్స్ అంచనాలను అందుకున్నారా లేదా? అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

కథ :

జీవితం మీద ఎన్నో ఆశలు ఉన్నటువంటి ఒక యువకుడు , బ్రతికితే లగ్జరీ లైఫ్ బ్రతకాలి అనే లక్ష్యం తో ఉంటాడు. అలాంటి సమయం లో అతనికి విలువైన ఖజానా ని దొంగిలించే అవకాశం దక్కుతుంది. వచ్చిన ఆ అవకాశాన్ని కోల్పోకుండా , తన స్నేహితులతో కలిసి ఆ ఖజానా ని దొంగిలించే స్కీం వేస్తాడు. ఈ ప్రయాణం లో హీరో కి ఎదురైనా సవాళ్లు , అతనితో చేతులు కలిపిన వాళ్ళు ఇచ్చే ట్విస్టులతో ఈ సినిమా స్క్రీన్ ప్లే సాగుతుంది.

విశ్లేషణ:

ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సినిమా చాలా రొటీన్ గా వెళ్తుంది అనే భావన కలుగుతుంది. హీరో కి తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఉండడం, వాటి నుండి బయటపడేందుకు ఒక పెద్ద దొంగతనం చెయ్యాలని అనుకోవడం, ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ని ఎన్నో వందల సినిమాల్లో చూసి ఉంటాము. కథ రొటీన్ అయినప్పటికీ , టేకింగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటే ఆడియన్స్ కచ్చితంగా బ్రహ్మరథం పడుతారు. కానీ ఈ సినిమాకు అదే మిస్ అయ్యింది. జేసన్ సంజయ్ కుర్రోడు కాబట్టి , అన్నీ నేటి తరం ఆడియన్స్ కి తగ్గ ఆలోచనలతో సినిమా తీస్తాడని అందరూ భావిస్తారు. కానీ అవుట్ డేటెడ్ టేకింగ్ తో థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి బోరు కొట్టించాడు.

కనీసం సెకండ్ హాఫ్ ని అయినా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపిస్తాడని అనుకుంటే , ఫస్ట్ హాఫ్ కంటే దారుణంగా తీశాడు. ఇక ఈ సినిమాలోని విలన్స్ అసలు ఎందుకు ఉన్నారో అర్థం కాదు. వాళ్ళు చేసే పనులకు ఎలాంటి లాజిక్స్ ఉండవు. ప్రతీ సన్నివేశం రెండు దశాబ్దాల క్రితం తీసిన సన్నివేశం లాగా అనిపించింది. సినిమా మొత్తం మీద కాస్తో కూస్తో క్లిక్ అయ్యింది ఏదైనా ఉందా అంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రమే. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. సాధారణంగా ఇలాంటి హీస్ట్ మూవీస్ ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించే స్కోప్ ఉంది. సంజయ్ యంగ్ డైరెక్టర్ , ఎన్నో హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసి ఉంటాడు కాబట్టి , కచ్చితంగా ఆ స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని భావించారు. కానీ చివరికి నిరాశపరిచాడు.

ఓవరాల్ గా ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2/5. రొటీన్ సినిమాలను నచ్చేవాళ్లకు పర్వాలేదు ఒక్కసారి చూడొచ్చు అనే ఫీలింగ్ ని ఇస్తుంది ఈ సినిమా , అలా కాకుండా , భారీ అంచనాలు పెట్టుకొని వెళ్తే మాత్రం నిరాశకు గురవుతారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper