Homeఎంటర్టైన్మెంట్Srihari: శ్రీహరికి మగధీర మూవీ నచ్చకపోవడానికి కారణం ఏంటి తెలిసిపోయిందిగా...

Srihari: శ్రీహరికి మగధీర మూవీ నచ్చకపోవడానికి కారణం ఏంటి తెలిసిపోయిందిగా…

Srihari: చిరుత సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్… తన రెండో సినిమాగా మగధీర మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో తను అద్భుతమైనటువంటి నటనను కనబరచడం విశేషం… ఈ మూవీలో శ్రీహరి సైతం ఒక కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మొత్తం పూర్తయిన తర్వాత శ్రీహరి తో పాటు మరికొంతమంది ప్రముఖుల కోసం ఈ సినిమా ప్రివ్యూ షోస్ వేశారట. అయితే ఈ సినిమాని […]

Srihari: చిరుత సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్… తన రెండో సినిమాగా మగధీర మూవీని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో తను అద్భుతమైనటువంటి నటనను కనబరచడం విశేషం… ఈ మూవీలో శ్రీహరి సైతం ఒక కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ మొత్తం పూర్తయిన తర్వాత శ్రీహరి తో పాటు మరికొంతమంది ప్రముఖుల కోసం ఈ సినిమా ప్రివ్యూ షోస్ వేశారట. అయితే ఈ సినిమాని మొదటిసారి చూసిన శ్రీహరికి మగధీర మూవీ పెద్దగా నచ్చలేదట. కారణం ఏంటంటే ఆయన చాలా కష్టపడి చేసిన కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తీసేశారు. దాంతో ఆయన ఆ సినిమా ప్రివ్యూ చూసి సినిమా ఎలా ఉందని అడిగేలోపే తను ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. కారణం ఏంటని తర్వాత అల్లు అరవింద్ అడిగితే ఆయనకు క్లారిటీగా చెప్పారట.

దాంతో అయిన కొద్ది రోజులకు శ్రీహరి నటించిన కొన్ని సన్నివేశాలను సినిమాలో అయితే కలిపారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన సినిమాను తనకు నచ్చలేదని శ్రీహరి చెప్పడంతో చాలామంది అప్పట్లో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన కష్టపడి చేసిన సన్నివేశాలను సినిమాలో ఉంచితే అతనికి కూడా కొంతవరకు పేరొస్తుందని అనుకున్నాడట.

కాబట్టి ఆయన కూడా అలానే ఎక్స్ పెక్ట్ చేశాడు. మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల తర్వాత శ్రీహరి పూర్తి సన్నివేశాలను ఆడ్ చేయడంతో సినిమా ప్రేక్షకులందరికి నచ్చింది. అలాగే శ్రీహరి క్యారెక్టర్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే వచ్చింది.

ఆ తర్వాత చాలా సినిమాల్లో శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబట్టుకున్నాడు… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శ్రీహరి చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper