Rajasekhar Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న నటుడు రాజశేఖర్… కెరియర్ స్టార్టింగ్ లో ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లకు పెట్టింది పేరుగా మారాడు. అలాంటి రాజశేఖర్ తన కెరియర్ లో చిరంజీవితో ఎప్పుడు పోటీని పెట్టుకుంటూనే ఉన్నాడు. అతనితో పాటు పోటీపడుతూ సినిమా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేశాడు. కానీ అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. కొంతవరకు రాజశేఖర్ టాప్ హీరోగా రాణించినా కూడా ఆ తర్వాత ఆయన మార్కెట్ అనేది విపరీతంగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక 1999 వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘స్నేహం కోసం ‘ సినిమాలో విజయ్ కుమార్ పోషించిన పాత్రలో రాజశేఖర్ నటిస్తానని చిరంజీవికి చెప్పాడట. కానీ చిరంజీవి మాత్రం నీది చాలా చిన్న ఏజ్ ఆ క్యారెక్టర్ కి పెద్ద ఏజ్ ఉన్న వ్యక్తులు కావాలని చెప్పాడట. దాంతో రాజశేఖర్ నిజమే కదా అని ఆ క్యారెక్టర్ లో నటించాలనే అదను తీసేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తానని రాజశేఖర్ తన మనసులోని మాటను చిరంజీవి కి చెప్పాడట. మెగాస్టార్ మాత్రం రాజశేఖర్ నేను రీఎంట్రీ ఇస్తున్నాను కదా దానివల్ల నిన్ను విలన్ గా పెడితే మన ఇద్దరం హీరోలమే కాబట్టి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో క్లారిటీ లేదు. కాబట్టి దానికి కొత్త విలనైతే బాగుంటాడని చెప్పాడట.
మొత్తానికైతే ఆ పాత్రలో నుంచి కూడా రాజశేఖర్ ని తప్పించారట. ఇక ఆ తర్వాత బాబీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ కోసం రాజశేఖర్ విపరీతంగా ప్రయత్నించాడు. కానీ అతనికి అవకాశాన్ని ఇవ్వలేదు. కారణం ఏదైనా కూడా రాజశేఖర్ చిరంజీవితో సినిమా చేయాలని మొదటి నుంచి భావిస్తున్నాడు. కానీ రాజశేఖర్ ను పెట్టుకునే ఉద్దేశ్యం చిరంజీవికి లేదని ఆయన ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తున్నాడు.
కారణం ఏంటి అంటే చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య గతంలో కొన్ని విభేదాలైతే వచ్చాయి. రాజశేఖర్ పలు సందర్భాల్లో చిరంజీవి మీద కోపాన్ని వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకు ఎలాంటి కోపం లేదు కానీ సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తే ప్రేక్షకులు వారిని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదని అందువల్లే రాజశేఖర్ ని చిరంజీవి పక్కన పెడుతున్నట్టుగా సమాచారమైతే వస్తుంది…నిజానికి రాజశేఖర్ కి లేదు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి తను ఆయన మూవీలో విలన్ గా చేస్తే వల్ల నుంచి చిరంజీవి నెగెటివ్ అయిపోతాడేమోనని ఆలోచిస్తున్నాడట…