Jailer 2 Movie: కొంత మంది హీరోలకు లైఫ్ లైన్ లాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలు లేకపోతే కెరీర్ అవుట్ అనే రేంజ్ అన్నమాట. ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా ఇది తప్పదు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘రోబో’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , రజినీకాంత్ చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. లింగ , కబాలి , కాలా, పెట్ట , దర్బార్ , అన్నతే ఇలా వరుసగా కమర్షియల్ ఫ్లాప్స్ వచ్చాయి. మధ్యలో వచ్చిన 2.0 ఒక్కటే కలెక్షన్స్ పరంగా రజినీకాంత్ కి మంచి బ్రేక్ ఇచ్చింది కానీ , కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ గానే నిల్చింది. ఇలా సరైన కమర్షియల్ సక్సెస్ లు లేకపోవడం తో రజినీకాంత్ కెరీర్ ఇక అయిపోయిందని అంతా అనుకున్నారు.
అదే సమయం లో విజయ్ వరుస హిట్స్ తో తమిళనాడు లో రజినీకాంత్ మార్కెట్ ని దాటేశాడు , ఓవర్సీస్ లో కూడా రజినీకాంత్ కి సమానం గా మారిపోయాడు. ఇక రజిని ఎరా ముగిసింది , విజయ్ ఎరా మొదలైంది అని అంతా అనుకుంటున్న సమయం లో ‘జైలర్’ చిత్రం వచ్చింది. చాలా సాధారణమైన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ‘జైలర్’ చిత్రానికి ఫుల్ రన్ లో 650 కోట్ల రూపాయిల గ్రాస్ రాగా , ‘జైలర్ 2’ చిత్రానికి మొదటి వారం లోనే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో కచ్చితంగా ‘జైలర్ 2’ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే కోలీవుడ్ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల గ్రాసర్ ని అందించిన హీరోగా రజినీకాంత్ చరిత్రలో నిల్చిపోతాడు.
నేటి తరం తమిళ స్టార్ హీరోలు కూడా సాధించలేని రికార్డు ని , రజినీకాంత్ 76 ఏళ్ళ వయస్సులో కూడా సాధించి పెట్టాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ‘జైలర్’ సిరీస్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అనే విషయం మీకు తెలుసా?.. ‘బీస్ట్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వడం తో నెల్సన్ దిలీప్ కుమార్ తో స్టార్ డైరెక్టర్స్ పని చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఆ సమయం లో ఆయన టాలీవుడ్ హీరోల వైపు చూసాడు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా స్టోరీ ని వివరించాడు. ఆయనకు బాగానే నచ్చింది కానీ , ఇలాంటి పాత్రల్లో ఆడియన్స్ నన్ను చూడరేమో అనే అనుమానాలు మెగాస్టార్ లో కలిగాయి. ఎందుకంటే ‘గాడ్ ఫాదర్’ లో చిరంజీవి ఇలాంటి పాత్రనే పోషించాడు.
ఆ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. దీంతో చిరంజీవి ఈ స్క్రిప్ట్ ని చేసే సాహసం చెయ్యలేదు. ఆ తర్వాత మళ్లీ కోలీవుడ్ లోనే తన ప్రయత్నాలను మొదలు పెట్టాడు నెల్సన్ దిలీప్ కుమార్. రజినీకాంత్ ని కలిసి స్టోరీ వినిపించగా, చాలా యావరేజ్ గా ఉంది, ఇది వర్కౌట్ అవ్వుద్ది అంటావా అని అన్నాడట రజినీకాంత్. మొదట్లో ఆయన ఓకే చెప్పడానికి చాలా సమయం తీసుకున్నాడట. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కెరీర్ మొత్తం ఫ్లాప్స్ లోనే ఉంది , పైగా నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ లాంటి ఫ్లాప్ ని లేటెస్ట్ గా అందించాడు , కథ కూడా చాలా యావరేజ్ గా ఉంది రిస్క్ చేయడం ఎందుకులే అని అనుకున్నాడట రజిని.
‘జైలర్’ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన అనేక కథలను విన్నాడట. ఒక్కటి కూడా నచ్చలేదట. వాటితో పోలిస్తే ‘జైలర్’ కథ బెటర్ గా ఉందని , తనకు ఇలాంటి పాత్ర ఈ మధ్య కాలం లో రాలేదు కాబట్టి , ఆడియన్స్ అంగీకరించొచ్చు ఏమో అనే ఉద్దేశ్యంతో ‘జైలర్’ చిత్రాన్ని ఒప్పుకున్నాడట. ఇక ఆ తర్వాత హిస్టరీ ఏంటో మన అందరికీ తెలిసిందే. అలా రజినీకాంత్ జైలర్ గ్రాండ్ సక్సెస్ కి మెగాస్టార్ చిరంజీవి కూడా పరోక్షంగా కారణం అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.