Kaaka Movie: ‘వాల్తేరు వీరయ్య ‘ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ‘కాకా’. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ని అభిమానులు ‘జైలర్’ తరహా సినిమాలు చెయ్యాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్లింప్స్ వీడియో చూసిన తర్వాత అలాంటి సినిమానే చేస్తున్నాడనే సిగ్నల్స్ ఇవ్వడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అభిమానులకు కొత్తదనం తో పాటు, చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ , యాక్షన్ కచ్చితంగా ఉండాలి. లేదంటే వాళ్ళు చాలా నిరాశకు గురి అవుతారు. గతం లో ‘గాడ్ ఫాదర్’ విషయం లో కూడా ఇదే జరిగింది.
అందుకే డైరెక్టర్ బాబీ మెగాస్టార్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోలో చిరంజీవి చాలా యంగ్ లుక్ తో , కోరమీసం తో కనిపించాడు. చూస్తుంటే ఒక మంచి కామెడీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అభిమానులు మెగాస్టార్ ని ఆ లుక్ లో చూడగానే ఒక్కసారిగా శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరివాడు చిత్రాల్లోని మెగాస్టార్ ని గుర్తు చేసుకున్నారు. చెవిపోగులు , కోరమీసం , సన్నని గెడ్డం తో మెగాస్టార్ నేటి తరం యంగ్ హీరోలను సైతం డామినేట్ చేసే విధంగా కనిపిస్తున్నాడు. కామెడీ టైమింగ్ కూడా అదరగొట్టేలా అనిపిస్తున్నాడు. అయితే ఎందుకో కొద్దిగా ‘వాల్తేరు వీరయ్య’ షేడ్స్ కూడా కనిపిస్తోంది.
ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి పెద్ద గ్యాంగ్ స్టర్ అని , యాక్షన్ సన్నివేశాలు భీభత్సంగా ఉంటాయని షూటింగ్ ప్రారంభానికి ముందు ఒక లీక్ వచ్చింది. దీంతో అందరూ చిరంజీవి ని స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గెటప్ లో ఊహించుకున్నారు ఫ్యాన్స్. కానీ ‘వాల్తేరు వీరయ్య’ తరహాలో , మాస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారని నేడు ఈ లీకెడ్ వీడియో చూసిన తర్వాతే అర్థం అవుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన వార్తలు రాబోతున్నాయి అనేది.