AP Holiday: సాధారణంగా విద్యార్థులకు సెలవులంటే ఎగిరి గంతేస్తారు. సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అటువంటి వారికి శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రేపు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సెలవు. అయితే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం అప్సనల్ హాలిడే మాత్రమే. శ్రావణమాసం సందర్భంగా ఈ నెలలో పూజలు, పెళ్లిళ్లకు ప్రత్యేకత ఉంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ లక్ష్మీదేవి పూజలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
* వరలక్ష్మీ వ్రతం తో..
శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ నెల 21న నిర్వహించాలా.. లేకుంటే ఈ నెల 28న పూజ చేపట్టాలా అన్నది ప్రజలు అయోమయంలో ఉంటూ వచ్చారు. కానీ పండితులు మాత్రం రేపు చేయాలని సూచించడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రేపు ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఈ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవులు అధికం. 2,9,16,23,30 తేదీలలో ఆదివారం సెలవులుగా వచ్చాయి. 8వ తేదీ రెండో శనివారం కావడం వల్ల వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.
* ఈనెల 25 సైతం..
ఈనెల 25న ఏపీలో సెలవు. ఈద్ మిలాద్ ఉన్ నబి సందర్భంగా ఏపీలో సెలవు ఉంది. కానీ ఇదే పండుగను పురస్కరించుకొని 26న తెలంగాణలో సెలవు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అలాగే 28న రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణలో హాఫ్ డే సెలవు ప్రకటించారు. కానీ ఏపీలో మాత్రం అప్షనల్ హాలిడే గా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఆగస్టులో వరుసగా సెలవులతో విద్యార్థులు గడిపారు. మరోవైపు ఏపీలో ఫార్మేటివ్ 1 పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా విద్యా సంవత్సరం సందర్భంగా షెడ్యూల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే రోజు సెలవు ప్రకటించడంతో పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సైతం ప్రత్యేక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో వినాయక చవితి తో పాటు పండుగలు ఉన్నాయి. వినాయక నవరాత్రులు వచ్చాయంటే విద్యార్థుల్లో సందడే వేరు. ఇక అక్టోబర్లో అయితే దసరా సెలవులు ఉన్నారు.. ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.